హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్న బ్యూటీ అమలా పాల్. సాదాసీదాగా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. తనదైన శైలి టాలెంట్‌తో దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. దీంతో అన్ని భాషల్లోనూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. అదే సమయంలో అందాల విందు చేస్తూ మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమలా పాల్ కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. టాలీవుడ్ ప్రవేశం
'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా అమలా పాల్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంటరై కొన్ని సినిమాల్లో నటించింది. ఆ రెండు చోట్లా సక్సెస్‌ను అందుకున్న ఆమెకు తెలుగులో మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడ అమలా పాల్ నటించిన సినిమాలు 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' హిట్ కాలేదు.

అతడితో పెళ్లి.. విడాకులు తీసుకుని
వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని షాకిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

నగ్నంగా నటించి నేషనల్ రేంజ్‌లో
పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె పలు మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దీంతో అమలా పాల్ చేసిన సాహసం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.

డేటింగ్‌లో అమల... రెండో పెళ్లి అని
విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్త వైరల్ అయింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు బయటకు రావడంతో వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం మొదలైంది. దీంతో అమల ఆ వార్తలను ఖండించడంతో వాటికి పుల్‌స్టాప్ పడింది.

కుడిఎడమైతే అంటూ వచ్చిన భామ
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా కోసం అమలా పాల్ 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 'యూటర్న్' ఫేం పవన్ కుమార్ దీనికి దర్శకుడు. టైమ్ లాప్స్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సిరీస్‌లో ఆమెతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషించారు. ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
అక్కడ మాత్రం రచ్చ చేస్తూ ఉంది
అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.
Recommended Video
హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అమల
సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ చేసే అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లేజర్ ధరించినవి కొన్ని, బీచ్‌లో ఆడుకుంటోన్న ఫొటోలు కొన్ని ఉన్నాయి. ఈ ఫొటోల్లో అమలా పాల్ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది.


Click it and Unblock the Notifications











