twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిగరెట్ తాగుతూ కనిపించిన అమలా పాల్, నెటిజన్ల ఫైర్

    |

    సినీ స్టార్లు పొగతాగుతున్న పోస్టర్లు, ఫోటోలు ఈ మధ్య వివాదాలకు కేంద్ర బింధువులుగా మారుతున్నాయి. గతంలో విజయ్ స్మోకింగ్ చేస్తూ 'సర్కార్' పోస్టర్ మీద దర్శనమివ్వగా విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇటీవల హన్సిక 'మహా' మూవీ పోస్టర్ సైతం ఇదే కారణంతో వివాదంలో ఇరుక్కుంది.

    'మహా' మూవీ పోస్టర్లో హన్సిక పోగతాగుతూ కనిపించడంతో ఆమెతో పాటు దర్శకుడు జమీల్ మీద పిఎంకె నాయకుడు జానకిరామన్ కేసు వేశారు. ఈ పోస్టర్ హిందువల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆయన ఫిర్యాదు చేశారు.

     Amala Paul slammed for posing with cigarette

    తాజాగా హీరోయిన్ అమలా పాల్ సిగరెట్ పట్టుకుకుని స్మోక్ చేస్తున్న ఫోటో షేర్ చేయడం కూడా వివాదస్పదం అయింది. ఈ ఫోటో ద్వారా అమలా పాల్ ఒక దురలవాటును ప్రమోట్ చేస్తుందంటూ నెటిజన్లు మండి పడ్డారు.

    అయితే తాను స్మోకింగ్‌ను ప్రమోట్ చేయడం లేదని, స్టైలిష్ ఫోటో షూట్లో భాగంగానే ఇలా సిగరెట్ పట్టుకుని ఫోజు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఏఎల్ విజయ్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయిన అమలా పాల్... ప్రస్తుతం 2 తమిళ చిత్రాలు, ఒక మలయాళం చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

    English summary
    Amala recently shared few pictures on Instagram in which she is seen smoking a cigarette. Though many fans called the pictures 'hot' and 'kick-ass', Amala was trolled by many other followers, who slammed her for promoting smoking.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X