Amala Paul: అమాయకంగా కనిపిస్తూనే వంగి ఎద అందాలు చూపిస్తున్న అమలా పాల్.. తట్టుకోగలరా?
క్యూట్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అమలాపాల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఊహించని విధంగా ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ హై లెవెల్ లో ఉండే విధంగా చూసుకుంటుంది. ఇక రీసెంట్ గా కూడా మరొక ఫోటోతో అమలాపాల్ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. గతంలో కంటే ఘాటైన అందంతో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.

బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా..
2009 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమలాపాల్ ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసింది. అంతేకాకుండా పలు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. ఎక్కువగా ఆమె కెరీర్ లో అయితే ప్రయోగాత్మకమైన సినిమాలే మంచి విజయాన్ని అందించాయి. ఇక ప్రతి సినిమాల్లో కూడా ఆమె డిఫరెంట్ గా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

పర్సనల్ కాంట్రవర్సీలు
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతున్న అమలాపాల్.. పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని కాంట్రవర్సీ విషయాలతో హైలైట్ అవుతూ వచ్చింది. ఇక ఆమె 2014లో దర్శకుడు AL విజయ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మూడేళ్ల తర్వాత మాత్రం అతనితో విభేదాలు వచ్చి విడిపోయింది. ఇక తర్వాత మరొక బిజినెస్ మెన్ తో కూడా ఆమె ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

టాలీవుడ్ సినిమాలతో..
తమిళంలోనే కాకుండా తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కూడా అమలాపాల్ సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక మొదటగా తెలుగులో అయితే బెజవాడ అనే సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, నాయక్, పిట్టకథలు అనే సినిమాలు చేసింది. తెలుగులో అయితే చేసింది కొన్ని సినిమాలైనా మంచి గుర్తింపు లభించింది. అలానే తమిళంలో చేసిన చాలా సినిమాలు తెలుగులో అనువాదం కావడంతో ఆమెకు అలా కూడా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.

సినిమాలతో బిజీబిజీగా..
ఇక అమలాపాల్ తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఖాళీగా కనిపించింది లేదు. ఏడాదికి మినిమం రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో అయితే కే ఏడాదిలో ఆమె ఐదు సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఖైదీ రీమేక్ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ చేస్తూ ఉండగా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.
ఎద అందాలు ఘాటుగా కనిపించేలా..
ఇక అమలాపాల్ గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు మరో షాక్ ఇచ్చే లుక్ లో కనిపించింది. ఏదో డివోషనల్ మూడ్ లో ఉన్నట్టుగా ఒక బొట్టు కూడా పెట్టుకుంది. ఇక దానికి తోడు ఆమె గ్లామర్ డ్రెస్ లో క్లివెజ్ షో తో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎద అందాలు చాలా ఘాటుగా కనిపించేలా ఫోటోలకు స్టిల్ ఇవ్వడంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆఫర్లు వస్తే మరోసారి బికినీలో..
అమలాపాల్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించింది. ఇక గతంలో కూడా ఈ బ్యూటీ బికినీ అందాలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తే మరోసారి బికినీలో కనిపించడానికి కూడా రెడీ అని అంటుంది. ప్రస్తుతం అయితే మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్న అమలాపాల్ అజయ్ దేవగన్ భోళా సినిమాలో కూడా నటిస్తోంది. ఇక అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది.


Click it and Unblock the Notifications











