ఆధ్యాత్మిక బాట పట్టిన అమలా పౌల్
అమలా పాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానేవచ్చింది. మెగా హీరోల పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. చరణ్ "నాయక్".. బన్నీ "ఇద్దరమ్మాయిలతో" సినిమాల్లో నటించింది. అయినా కూడా ఎందుకో ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. దాంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఈ భామ. ఉన్నట్టుండి ఈ అమ్మడు పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టింది. పంచకర్మ అంటూ వేదాంతాలు వల్లిస్తుంది .

"శరవేగంగా దూసుకుపోతున్న జీవితాలలో పాశ్చాత్య ప్రభావంలో చాలా కోల్పోయాం. నిజానికి మన పూర్వీకుల సంపదను మనం అరుదుగా విలువైనదిగా భావిస్తాము. నేటి జనం ఆచరణలో పెట్టడానికి అవసరమైన సమాచార బంగారు గనిని విడిచిపెట్టారు. శారీరకంగా మానసికంగా నా లైఫ్ లో ఉత్తమ సంస్కరణగా మారడానికి నేను పంచకర్మ అనే వైద్య ప్రక్రియమొదలుపెట్టాను . ఈ చికిత్స పూర్తి పరివర్తన.. ప్రక్షాళన .. పునరుజ్జీవనానికి సంబంధించినది అంటూ చెప్పుకొచ్చింది. నా 28 రోజుల పంచకర్మ అనుభవంలో 20వ రోజున ఇదిగో ఇలా ఉన్నాను" అంటూ కొన్ని ఫోటోల్నిసోషల్ మీడియాలో షేర్ చేసింది అమలా పాల్. ఇక ఈ ఫొటోలు ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో చెప్పాల్సిన పనిలేదు.


Click it and Unblock the Notifications











