షర్ట్ విప్పేసి సెగలు రేపుతోన్న అమలా పాల్: దానికి ఒప్పుకుంటే దారుణం జరుగుతుందంటూ షాకింగ్ పోస్ట్
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా కొంత మంది సినిమాల్లో అంతగా రాణించలేరు. ఒకవేళ తమలోని అన్ని కోణాలనూ నిరూపించుకున్నప్పటికీ అంతగా అవకాశాలను అందుకోలేరు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే సత్తా చాటిన ఆ భామ.. సుదీర్ఘ కాలం పాటు అవకాశాలను అందుకోలేకపోయింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులే ఆమెకు ఈ పరిస్థితిని కల్పించాయనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అమలా పాల్ ఓ హాట్ ఫొటోను సోషల్ మీడియాలో వదిలింది. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

తెలుగులో బడా సినిమాల్లో... ఫలితం లేదు
'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది అమలా పాల్. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంటరై కొన్ని సినిమాల్లో నటించింది. ఆ రెండు చోట్లా సక్సెస్‌ను అందుకున్న ఆమెకు తెలుగులో మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడ అమలా పాల్ నటించిన నాలుగు సినిమాలు 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' చేసినా హిట్ మాత్రం కొట్టలేదు.

అతడితో ప్రేమ వివాహం.. వెంటనే విడాకులు
వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని షాకిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం అన్ని ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

న్యూడ్ షోతో రెచ్చిపోయింది.. హాట్ టాపిక్‌గా
విజయ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె పలు మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దీంతో అమలా పాల్ చేసిన సాహసం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

సింగర్‌తో అమలా పాల్ వివాహం.. క్లారిటీతో
కొద్ది రోజులుగా అమలా పాల్ ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్త వైరల్ అయింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు బయటకు రావడంతో వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అమలా పాల్ ఆ వార్తలను ఖండించింది. దీంతో వాటికి పుల్‌స్టాప్ పడింది.

మొదటిసారి అలా నటిస్తోన్న అమలా పాల్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా కోసం అమలా పాల్ ఓ వెబ్ సిరీస్‌ను చేస్తోంది. సమంతతో 'యూటర్న్' అనే సినిమాను తెరకెక్కించిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో ఆమెతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌పై అంచనాలున్నాయి.

షర్ట్ విప్పేసి సెగలు రేపుతోన్న అమలా పాల్
అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అమలా పాల్ ఓ హాట్ పొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

వాటిని మార్చేశాను అంటూ షాకింగ్ పోస్ట్
రెడ్ చెక్స్ ఉన్న షర్ట్ బటన్స్ తీసేసి తన ఇన్నర్ వేర్ చూపిస్తూ దిగిన ఫొటోలను అమలా పాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి 'నేను మార్చలేని విషయాలను ఇకపై అంగీకరించను. నేను అంగీకరించలేని విషయాలను ఇప్పుడు మార్చాను. మీరు ద్వేషించే వాటిని అంగీకరిస్తే మీ జీవితం దారుణంగా మారుతుంది' అంటూ ఫిలాసఫీ కొటేషన్స్ కూడా రాసుకొచ్చిందీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











