అలాంటి వెబ్ సిరీస్‌లో అమలా పాల్: భారీగా ఖర్చు చేస్తున్న బడా నిర్మాత
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ హీరోయిన్ అమలా పాల్. 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంటరై కొన్ని సినిమాల్లో నటించింది. ఆ రెండు చోట్లా సక్సెస్‌ను అందుకున్న ఆమెకు తెలుగులో మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడ అమలా పాల్ నటించిన నాలుగు సినిమాలు 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' ఫట్ అన్నాయి. దీంతో టాలీవుడ్‌కు దూరమై ఇతర భాషల చిత్రాల్లో నటిస్తోందీ అమ్మడు.
సుదీర్ఘ విరామం తర్వాత అమలా పాల్ మరోసారి తెలుగులో నటించబోతుందని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆమె నటించేది సినిమాలో కాదు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా వీడియో కోసం అని సమాచారం. సమంతతో 'యూటర్న్' అనే సినిమాను తెరకెక్కించిన పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో అమలా పాల్ నటిస్తుందని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ సిరీస్‌లో ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే తమ సంస్థలో తమన్నా, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు హీరోయిన్లతో వెబ్ సిరీస్‌లు నిర్మించిన అల్లు అరవింద్.. అమలా పాల్‌తో చేయబోయే ప్రాజెక్టు కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఆ మధ్య 'అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమలా పాల్.. అందులో నగ్నంగా నటించి షాకిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయిందీ అమ్మడు. ఇక, పర్సనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications











