గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట

అక్కినేని నాగ చైతన్య నటించిన 'బెజవాడ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది గ్లామరస్ హీరోయిన్ అమలా పాల్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌తో 'నాయక్', అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', నానితో 'జెండాపై కపిరాజు' అనే సినిమాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత మరోసారి తెలుగులో నటిస్తోందీ అమ్మడు.

రెండేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది అమలా పాల్. దీని తర్వాత వైవిధ్యమైన పాత్రలను మాత్రమే పోషిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్‌ను చేస్తోంది. సమంతతో 'యూటర్న్' అనే సినిమాను తెరకెక్కించిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో ఆమెతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌పై అంచనాలున్నాయి.

Amala Paul Web Series Shoot Completed

ఇక, లాక్‌డౌన్ తర్వాత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. ఏకధాటిగా సాగిన చిత్రీకరణ రెండు రోజుల క్రితమే ముగిసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ వెంటనే యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేసిందట. ఇదిలా ఉండగా, ఇందులో అమలా పాల్ చేస్తున్న పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. తన గత సినిమాల్లో చేయని కొన్ని సాహసాలు ఇందులో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సిరీస్‌లో కొంత స్పైసీగానూ కనిపించిందట ఈ సుందరాంగి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X