తన 'బేబీ'కి అమలాపాల్ ముద్దులు.. ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఫోటోలు!

హాట్ బ్యూటీ అమలాపాల్ తరచుగా వివాదాలతో వార్తల్లో ఉండే హీరోయిన్. వైవాహిక జీవితంలో వివాదాలు ఎదుర్కొన్న అమలపాల్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. విభిన్నమైన పాత్రలు, బోల్డ్ రోల్స్ ఎంచుకుంటూ దూసుకుపోతోంది. కానీ అమలాపాల్ తెలుగులో నటించి చాలాకాలమే అవుతోంది. తమిళం, మలయాళంలో ఎక్కుగా అవకాశాలు పొందుతోంది. పబ్లిసిటీ కోసం అమలాపాల్ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా. తాజాగా అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 తన 'బేబీ'కి ముద్దులు

తన 'బేబీ'కి ముద్దులు

అమలాపాల్ తన పెంపుడు కుక్కతో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని దున్నేస్తున్నాయి. అమలాపాల్ పెంపుడు కుక్క పేరు బేబీ. బేబీకి ముద్దులు పెడుతూ ఉన్నట్లు, దానిని ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల క్రిస్టమస్ సందర్భంగా తన బేబీతో ఎక్కువ సమయం గడిపానని అమలాపాల్ చెబుతోంది.

 రాక్షసన్‌తో ఘనవిజయం

రాక్షసన్‌తో ఘనవిజయం

అమలాపాల్ తమిళ చిత్రం రాక్షసన్ లో కీలక పాత్రలో నటించింది. అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. గ్లామర్ రోల్స్, లేడి ఓరియెంటెది చిత్రాలు, హర్రర్ చిత్రాలు ఇలా తేడా లేకుండా అమల అన్ని జోనర్స్ లో నటిస్తోంది. ఆ మధ్యన అమల నటించిన కొన్ని చిత్రాలకు ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

సిగరెట్ స్మోకింగ్‌తో కాంట్రవర్సీ

సిగరెట్ స్మోకింగ్‌తో కాంట్రవర్సీ

ఇప్పుడైతే అమలాపాల్ క్యూట్‌గా ఉండే ఫోటోలు పెట్టింది కానీ.. కొన్ని రోజుల క్రితం సిగరెట్ స్మోకింగ్ పిక్స్ పెట్టి కలకలం రేపింది. అమలాపాల్ పై నెటిజన్లు తీవ్రంగా దుమ్మెత్తి పోశారు. సరిగ్గా అదే సమయంలో హన్సిక మహా చిత్ర వివాదం కూడా ఉండడంతో హిందూ సంఘాలు హన్సిక, అమలాపాల్‌‌పై మండిపడ్డారు. సినీ నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశారు. ఎన్ని వివాదాలు ఎదురైనా తన దారి తనదే అంటూ అమల దూసుకుపోతోంది.

గాయాల నుంచి కోలుకుని

గాయాల నుంచి కోలుకుని

ఇదిలా ఉండగా అమలాపాల్ ప్రస్తుతం అదో అంద పారవై పోలా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా అమలాపాల్ ఇటీవల గాయపడింది. గాయాల నుంచి కోలుకుని మళ్ళీ షూటింగ్ తో బిజీగా మారుతోంది. క్రిస్టమస్ సందర్భంగా తీరిక దొరకడంతో తన బేబీతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X