50 ఏళ్ల వయసులో అలాంటి వేషాలా? మహేష్ హీరోయిన్ బోల్డ్ కామెంట్!
దాదాపు వయసుతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో హీరోలుగా కొందరు స్టార్స్ చాలా ఏళ్ళు సర్వైవ్ అయిపోతారు కానీ హీరోయిన్స్ కి అలా ఉండదు. ఎప్పుడో 30 ఏళ్ల కితం ఉన్న హీరోలు ఇప్పుడుకీ కొందరు స్టార్స్ హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు కానీ అప్పుడు వారి సరసన నటించిన హీరోయిన్స్ ఇప్పటికీ హీరోయిన్ గా నటించడం అనేది ఎప్పుడూ జరగలేదు.
ఇదే విషయాన్ని చాలా మంది హీరోయిన్ లు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అటు బాలీవుడ్ పరిశ్రమ నుంచి కానీ ఇటు టాలీవుడ్, ఇతర సౌత్ ఇండస్ట్రీ లలో కూడా ఇదే మాట నడుస్తుంది. మాకెవరు ఇప్పుడు అవకాశాలు ఇస్తారు అంటూ తాము పెదవి విరుస్తారు. అయితే ఇప్పుడు ఇదే జాబితాలో మరో హీరోయిన్ చేరింది.

కాగా ఈమె ఎవరో కాదు మన అందరికీ బాగా తెలిసిన హీరోయిన్ నే అమీషా పటేల్. టాలీవుడ్ లో కెరీర్ స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో "బద్రి", "నాని" అనే సినిమాలు చేసి తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు ఈమెకి 49 ఏళ్ళు కానీ ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు. దీనిపై మొన్ననే నాకు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు అని కూడా చెప్పుకొచ్చింది.
కాగా ఇప్పుడు మరో స్టేట్మెంట్ ఈమె చేసినట్టుగా ఒకటి వైరల్ గా మారింది. తనకి ఎవరైనా ఆంటీ లాంటి పాత్రలు ఆఫర్ చేస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తానని చెప్పిందట. ఇలానే బాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వదిలేసినట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఇక దీనికి అదనంగా ఆమె ఆ పాత్రలు ఎందుకు చేయదో కూడా చెప్పింది వింటే ఇంకా విడ్డురంగా ఉంటుంది.

ఇప్పుడు ఆమె 50 కి దగ్గరగా ఉన్నప్పటికీ తాను మనసులో ఇంకా 20 ఏళ్ళు లానే భావిస్తాను అని అందుకే హీరోయిన్ రోల్స్ అయితే ఓకే ఆంటీలు, ఇతర ఏజ్డ్ పాత్రలకి నో చెప్తానని ఆమె తెలిపింది. దీనితో ఈ స్టేట్మెంట్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా అమీషా అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో హీరో సన్నీ డియోల్ తో "గదర్ 2" లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మొత్తానికి అయితే అమీషా పటేల్ నుంచి ఈ నయా స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అయితే అమీషా పటేల్ పెద్దగా వేరే సినిమాలు ఏది చేస్తున్నట్టుగా లేదు.


Click it and Unblock the Notifications











