Dirty Hari హీరోయిన్‌పై దారుణంగా దాడి.. అండగా అమీషా పటేల్.. అసలు ఏం జరిగిందంటే?
బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన గద్దర్ సినిమాకు సీక్వెల్‌గా గద్దర్ 2 రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో మరోసారి అమీషా పటేల్, సన్నీడియోల్ జంటగా నటిస్తున్నారు. జీ 5 భాగస్వామ్యంతో నిర్మాత అనిల్ శర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో డర్టీ హరి హీరోయిన్ సిమ్రత్ కౌర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. అయితే దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బ్లూఫిలింస్ లాంటి సినిమాల్లో నటించే హీరోయిన్‌కు ఎలా అవకాశం ఇస్తారు అని ఓ వర్గం సోషల్ మీడియాలో దాడి ప్రారంభించింది. అయితే సిమ్రత్ కౌర్‌కు అండగా నిలిస్తూ అమీషా పటేల్ అండగా నిలిచింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
తెలుగులో డర్టీ హరీ లాంటి చిత్రాల్లో నటించిన సిమ్రత్ కౌర్ ఇటీవల కొన్ని అడల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె హాట్ హాట్‌గా నటించింది. ముద్దులు, మితిమీరిన శృంగారంలో మునిగి తేలింది. అయితే ఇటీవల ఇలాంటి వార్తలతో సిమ్రత్ కౌర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే గద్దర్ సినిమా రిలీజ్‌కు ముందు కొందరు సిమ్రత్ కౌర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసి తీవ్ర అసంతృఫ్తిని, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దేవుడా ఇలాంటి హీరోయిన్‌కు గద్దర్ సినిమాలో పెద్ద రోల్ ఉండకూడదని మొక్కుకుంటున్నాం. కేవలం మేము సన్నీడియోల్‌ను మాత్రమే చూస్తాం అంటూ సిమ్రత్ కౌర్ కామెంట్ చేశారు.
గద్దర్ 2 మూవీపై, సిమ్రత్ కౌర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడంపై అమీషా పటేల్ స్పందించింది. అయితే గదర్ 2 మూవీ చాలా నిజాయితీ కూడిన సబ్జెక్ట్. సిమ్రత్ కౌర్‌ను టార్గెట్ చేస్తూ సినిమాపై ఏదేదో ఊహించుకోకండి. మీరు ఏదేదో ఊహించుకొని ఇలాంటి పోస్టులు పెడుతూ, ఓ అంచనాకు రావొద్దు అని అమీషా పటేల్ సమాధానం ఇచ్చారు.

గద్దర్ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. సన్నీడియోల్ బ్రిల్లిమెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటారు. గద్దర్ 2 సినిమాపై మీరు దుష్ప్రచారం చేయకండి. మా సినిమాపై ప్రేమను కురిపించండి. గద్దర్ 2 మూవీ మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అని అమీషా పటేల్ తన ట్విట్టర్‌లో డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది.

గద్దర్ మూవీ, సిమ్రత్ కౌర్ గురించిన నెగిటివిపై అమీషా పటేల్ రోజంతా సమాధానాలు ఇస్తూనే కనిపించారు. అనంతరం ట్వీట్ చేస్తూ.. సిమ్రత్ కౌర్ గురించి చేస్తున్న నెగిటివిటీని అడ్డుకొంటూ రోజంతా గడిపాను. ఉత్కర్ష శర్మతో కలిసి సిమ్రత్ కౌర్ గద్దర్ 2 మూవీలో నటించింది. ఆ అమ్మాయిపై దుష్రచారం చేయకుండా పాజిటివిని చూపించండి. కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించాలి అంటూ అమీషా పటేల్ కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











