twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ షోలో హద్దు దాటిన పవన్ హీరోయిన్.. మరీ ఇంత దారుణమా!

    |

    సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలంటే చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతంగా నటించగల నైపుణ్యం ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే అవకాశాలు రాక కెరీర్ మసకబారుతుంది. ఇలా ఎంతో మంది నటీమణులు ఇప్పటికే కనుమరుగైపోయారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అమీషా పటేల్ ఒకరు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. అవకాశాలను అందుకోలేక సినిమాలకే దూరమైపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలిందామె.

    అలా మొదలైన అమీషా ప్రయాణం

    అలా మొదలైన అమీషా ప్రయాణం

    సినిమాల్లోకి రావడానికి ముందు అమీషా పటేల్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో కొన్ని వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. ఇలా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. 'కహో నా ప్యార్ హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది.

    పవన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ

    పవన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ

    హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన అమీషా పటేల్.. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చింది. ఇందులో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అమీషా.. కుర్రాళ్లకు క్రష్ అయిపోయింది.

    ఆ ఒక్కటి తప్ప మిగిలినవి ఫ్లాపులే

    ఆ ఒక్కటి తప్ప మిగిలినవి ఫ్లాపులే

    అమీషా నటించిన తెలుగు చిత్రాల్లో 'బద్రీ' ఒక్కటే హిట్ అయింది. దీని తర్వాత మహేశ్ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', బాలక‌ృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఇవన్నీ దారుణమైన పరాజయాలను చవి చూశాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ అమ్మడు దూరమైపోయింది. ఇక, గ్యాప్ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

    డైరెక్టర్‌తో ప్రేమాయణం.. బ్రేకప్ వల్ల

    డైరెక్టర్‌తో ప్రేమాయణం.. బ్రేకప్ వల్ల

    కెరీర్ ఆరంభంలో అమీషా పటేల్ ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. అయితే, క్రమక్రమంగా అన్నింట్లోనూ చిత్రాలను చేయడం తగ్గించింది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుసగా నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దర్శకుడు విక్రమ్ భట్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి అతడితో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పెళ్లికి కొద్ది రోజుల ముందే అతడికి బ్రేకప్ చెప్పేసిందామె.

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

    హీరోయిన్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమీషా పటేల్.. సోషల్ మీడియాలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఆమె దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచేసింది. అదే సమయంలో స్పెషల్ యాప్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ హాట్ టాపిక్ అయిపోతోంది.

    సినిమాల్లో అలా.. ఇందులో హాట్‌గా

    సినిమాల్లో అలా.. ఇందులో హాట్‌గా

    సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్.. తన అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. మొత్తంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

    హద్దు దాటిన అమీషా గ్లామర్ ట్రీట్

    హద్దు దాటిన అమీషా గ్లామర్ ట్రీట్

    తరచూ హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే అమీషా పటేల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా లోదుస్తులతో కనిపించింది. అలాగే, ప్యాంట్ జిప్ సైతం తీసేసి ఇన్నర్‌ కనిపించేలా ఫోజులిచ్చింది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయిపోయింది.

    English summary
    Tollywood actress and a former model Ameesha Patel Very Busy in Social Media. Now She Shared Hot Cleavage Show Photo In Instagram. This Pic Gone Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X