కరీనా కపూర్ నా ఆఫర్‌ను లాగేసుకొంది.. బాలీవుడ్ పాలిటిక్స్‌పై అమీషా పటేల్ ఫైర్
బద్రీ ఫేమ్ అమీషా పటేల్ మరోసారి బాలీవుడ్‌లోని రాజకీయాలను ఎండగట్టింది. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల వల్ల తాను పలు అవకాశాలను కోల్పోయాను అంటూ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో రూపొందిన యాదే చిత్రంలో తనకు రావాల్సిన ఆఫర్‌ను కరీనా కపూర్ ఎగురేసుకుపోయింది అంటూ తాజాగా వెల్లడించింది. యాదే చిత్రం రిలీజై జూలై 27వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.
2000 సంవత్సరంలో కరీనా కపూర్, తాను కెరీర్‌ను ప్రారంభించాం. వాస్తవానికి రాకేష్ రోషన్ దర్శకత్వంలో కహోనా ప్యార్ హై మూవీలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించాల్సింది. అయితే ఏదో కారణాల వల్ల ఆ సినిమాలో లాంచ్ కాలేదు. ఆమె స్థానంలో నన్ను తీసుకొన్నారు. ఆ తర్వాత ఆ సినిమా విజయం సాధించడంతో ఓవర్‌నైట్‌గా స్టార్‌ను అయ్యాను అని అమీషా పటేల్ తెలిపారు. ఆ తర్వాత సంవత్సరం జేపీ దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ చిత్రం ద్వారా అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

అయితే కహోనా ప్యార్ హై సినిమా షూటింగ్ సమయంలో రాకేష్ రోషన్ తన కుమారుడు హృతిక్ రోషన్ పైనే దృష్టిపెట్టారు. నన్ను కొంచెం కూడా పట్టించులేదు. నన్ను గ్లామర్‌గా చూపించలేదు. ఒకవేళ నన్ను అందంగా చూపించి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేది అని అమీషా పటేల్ అన్నారు.
ఆ తర్వాత నేను సుభాష్ ఘాయ్ తీయబోయే యాదే సినిమా కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. కానీ చివరకు నన్ను తొలగించి కరీనా కపూర్‌ను ఆ పాత్రకు తీసుకొన్నారు. చివరి నిమిషంలో ఆ పాత్ర నుంచి నన్ను తప్పించడానికి చాలా రాజకీయాలు జరిగాయి అని అమీషా పటేల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











