హీరోయిన్ అమీషా పటేల్‌పై కేసు... 2.5 కోట్ల చీటింగ్..
బాలీవుడ్ నటి అమీషా పటేల్ చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్నది. తన బిజినెస్ పార్ట్‌నర్‌తో అమీషాపటేల్‌పై చీటింగ్ కేసు నమోదు కావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సినిమా రూపొందిస్తామని భారీగా డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందనే ఆరోపణలపై బాధితుడు, నిర్మాత అజయ్ కుమార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...

దేశీ మ్యాజిక్ సినిమా కోసమని
నిర్మాత అజయ్ కుమార్ కథనం ప్రకారం.. దేశీ మ్యాజిక్ సినిమా తీస్తామని నా వద్ద నుంచి అమీషా పటేల్, ఆమె భాగస్వామి కునాల్ గ్రూమర్ రూ. 2.5 కోట్లు తీసుకొన్నారు. ఇప్పటి వరకు ఆ సినిమా వెలుగు చూడలేదు. దాంతో తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగాను. అయితే కొద్దికాలంగా డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పారు.

డబ్బు ఇవ్వకుండా నన్ను మోసగించారు
గతేడాది చివరల్లో రాంచీకి వచ్చిన వారికి రూ.2.5 కోట్లు ఇచ్చాను. మూడు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తామని చెప్పారు. సినిమా భారీగా లాభాలు తెస్తుందని నమ్మించారు. డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా చీటింగ్ చేశారు అని నిర్మాత అజయ్ కుమార్ రాంచీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అని నిర్మాత పిటిషన్‌లో పేర్కొన్నారు.

దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులు
అమీషా పటేల్, కునాల్‌పై ఒత్తిడి తీసుకురావడతో రూ.3 కోట్ల చెక్ ఇచ్చారు. పలుమార్లు వాళ్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దాంతో వారిపై మరింత ఒత్తిడి తీసుకువస్తే.. ఏం చేస్తావో చేసుకో.. దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారు. అమీషా పటేల్‌తో ఉన్న ప్రముఖుల ఫోటోను చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు అని నిర్మాత అజయ్ పేర్కొన్నారు.

అమీషా పటేల్‌పై చట్టపరమైన చర్యలు
అంతేకాకుండా కొద్ది రోజుల్లో దేశీ మ్యాజిక్ సినిమాను రిలీజ్ చేస్తాం. అప్పుడు మీకు డబ్బు ముట్ట చెప్పుతాం అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి నుంచి ఏం సమాధానం రాలేదు. దాంతో కోర్టులో వారిపై పిటిషన్ దాఖలు చేశాను. అమీషాపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాను అని అజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











