Ameesha Patel: ఘాటైన అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బద్రి బ్యూటీ.. ఈసారి అంతకుమించి!

మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన అమీషా పటేల్ చాలా తొందరగానే బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో వారుసహ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తెలుగులో కూడా సినిమాలు చేయాలని అనుకుంది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అమీషా పటేల్ ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తుంది. రీసెంట్ గానే ఆమె బికినీ అందాలతో కూడా మరోసారి స్టన్న అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి ఆదాయం అందుకుంటూ

మంచి ఆదాయం అందుకుంటూ

22 ఏళ్ళ నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న అమీషా పటేల్ దాదాపు 50 కి పైగా సినిమాలలో నటించింది. ఎన్నో రకాల కమర్షియల్ యాడ్స్ తో కూడా అప్పట్లోనే మంచి క్రేజ్ అందుకుంది. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకున్న హీరోయిన్ గా అప్పట్లో ఆమె వార్తల్లో నిలిచింది.

 మొదట అలా అనుకున్నారు

మొదట అలా అనుకున్నారు

ఇక మొదట ఆమె తెలుగులో అయితే భద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ఆ సినిమాలో ఆమె నటించిన విధానం చూసి మొదట హోమ్లీ హీరోయిన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిన అనంతరం అమీషా పటేల్ ఊహించిన విధంగా గ్లామర్ బ్యూటీగా మారిపోయింది.

బద్రి తరువాత

బద్రి తరువాత

ఇక బద్రి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఇక తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో కొన్నాళ్లు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. లవ్ స్టోరీలు యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అమ్మడికి బాలీవుడ్లో అప్పట్లో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా దక్కింది. ఇక 2003లో మళ్లీ బాలీవుడ్లో ఆమెకు వరుసగా డిజాస్టర్స్ ఎదురయ్యాయి.

వరుసగా డిజాస్టర్స్

వరుసగా డిజాస్టర్స్

ఇక అప్పట్లో మహేష్ బాబుతో నాని అనే సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహా అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఆ సినిమా కూడా ఊహించిన విధంగా దారుణమైన నష్టాలను కలుగజేసింది. దీంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు దొరకలేదు. ఇక చివరగా అయితే 2011లో బాలకృష్ణతో పరమావీరచక్ర అనే సినిమాలో నటించింది.

మరోసారి స్టన్ అయ్యేలా..

అయితే సినిమాలలో అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలలో గ్లామరస్ ఫోటోలతో వీడియోలతో తన ఉనికి చాటుకుంటూనే ఉంది. రీసెంట్ గా బికినీ అందాలతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె వయస్సు 50 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా రెండు పదుల వయస్సులో ఉన్న అమ్మాయి తరహాలోనే దర్శనం ఇస్తోంది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి లుక్స్ తో షాక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X