బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!
టాలీవుడ్‌లోకి కొన్ని వందల మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో అమీషా పటేల్ ఒకరు. తొలి సినిమాతో వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయిన ఈ భామ.. టాలీవుడ్‌కు దూరమైంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీషా పటేల్ ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూడండి!

అలా మొదలు.. బాలీవుడ్ ఎంట్రీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే అమీషా పటేల్ మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఎన్నో ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. దీంతో నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'కహో నా ప్యార్ హై' అనే హిందీ సినిమాతో అమీషా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది.

పవన్ సినిమాతో పరిచయమైంది
బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అమీషా పటేల్.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ మూవీ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చింది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అమీషా.. అందంతోనూ అందరి దృష్టినీ ఆకర్షించింది.

వరుస షాక్‌లు.. తెలుగుకు టాటా
తెలుగులో అమీషా పటేల్ చాలా చిత్రాలు చేసింది. అయితే వాటిలో బద్రీ ఒక్కటే హిట్ అయింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', బాలకృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాలు చేసింది. కానీ, ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఇక, గ్యాప్ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించిందామె.

ఆ డైరెక్టర్‌తో ప్రేమ.. బ్రేకప్ చెప్పి
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే అమీషా పటేల్ ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత అన్నింట్లోనూ గ్యాప్ తీసుకుంది. అయితే, బాలీవుడ్‌లో మాత్రం వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు విక్రమ్ భట్‌తో ప్రేమాయణం సాగించింది. అప్పటి నుంచి అతడితో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది. కానీ, పెళ్లికి కొద్ది రోజుల ముందే అతడికి బ్రేకప్ చెప్పింది.

సోషల్ మీడియాలో తెగ సందడి
అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటినా.. చాలా కాలంగా ఖాళీగానే ఉంటోన్నా.. అమీషా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం ఆమె యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే స్పెషల్ యాప్‌ను కూడా స్టార్ట్ చేసింది. వీటి ద్వారా తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ క్రేజ్ పెంచుకుంటోంది.
అందాల విందు చేస్తోన్న అమీషా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ సందడి చేసే అమీషా పటేల్.. తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. సినిమాల్లో డీ గ్లామర్‌గా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా పేరును కూడా తెచ్చుకుంది.

అమీషా పటేల్ వీడియో వైరల్
బోల్డు బ్యూటీ అమీషా పటేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్నానం చేసిన తర్వాత జుట్టును ఆరబెట్టుకుంటూ కనిపించింది. ఈ వీడియోలో అమీషా స్నానం చేసిన తర్వాత వేసుకునే దుస్తులు ధరించింది. ఫలితంగా ఇందులో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











