ఆ పనికి పాతికేళ్ల కుర్రాళ్లే బెటర్... 50 ఏళ్ల వయసులో హీరోయిన్ ఘాటు కామెంట్స్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో 50 ప్లస్ దాటిన వాళ్లు కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్, టబు, అనుష్క శెట్టి, ప్రభాస్, త్రిష లాంటి వాళ్లు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్. 50 క్రాస్ చేసేసిన ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. తాజాగా పెళ్లి, ఎఫైర్లు, రిలేషన్‌పై అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

పాతికేళ్లకు పైగా కెరీర్‌
2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ - పూరీ జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన బద్రీతో తెలుగు వారిని పలకరించారు. అలా తెలుగు, హిందీలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు అమీషా పటేల్‌. కొత్త అందాల రావడంతో పాటు తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తర్వాతి కాలంలో ఆమె హవా తగ్గింది. ఈ దశలో సన్నీడియోల్‌తో చేసిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి తనలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు అమీషా పటేల్.

Ameesha Patel opens up on marriage and her ready to dating with younger men

ఐదేళ్లపాటు ఆయనతో డేటింగ్
అయితే సినిమాల కంటే వివాదాలు, వ్యక్తిగత విషయాలతో అంతకుమించి పాపులర్ అయ్యారు అమీషా. తొలుత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్ భట్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ ఆయనను పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితోనూ డేటింగ్ చేసింది. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. తనకు పెళ్లి కంటే కెరీరే ముఖ్యమని కనవ్‌కు కూడా బైబై చెప్పేశారు అమీషా పటేల్.

ఆ ప్రొడ్యూసర్‌తో సహజీవనం
అయినప్పటికీ ఆమె ప్రేమాయణాలకు చెక్ పడలేదు. బాలీవుడ్ నిర్మాత కునాల్ గూమర్‌తో అమీషా సహజీవనం చేసిందనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోగా.. అమీషా కానీ, కునాల్ కానీ తమ బంధం గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇక పారిశ్రామికవేత్త, బిలియనీర్ నెస్ వాడియాతోనూ అమీషా పటేల్ ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చినప్పటికీ తాము ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

వ్యాపారవేత్తతో ప్రేమాయణం
తాజాగా నిర్వాన్ బిర్లా అనే యువ వ్యాపారవేత్తతో దుబాయ్‌లో అమీషా పటేల్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటంతో బాలీవుడ్ మరోసారి షాక్ అయ్యింది. నిర్వాన్ ఒడితో కూర్చోవడం, ఇద్దరూ ఒకటే రంగు బట్టలు ధరించడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీషా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకుంటామని ఎన్నో ప్రతిపాదనలు వస్తున్నాయి. నా వయసులో సగం కూడా లేనివాళ్లు కూడా భార్యగా చేసుకుంటామని అంటున్నారు అని అమీషా చెప్పారు.

వాళ్లయినా పార్ట్‌నర్‌గా ఓకే
అయితే పెళ్లి తర్వాత నటిగా కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనే కండీషన్ పెడుతున్నారు. మనల్ని ఇష్టపడేవారు.. మనం ఎదగాలని, ఉన్నతంగా ఉండాలని కోరుకోవాలి. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి, కెరీర్ కోసం చాలా కోల్పోయాను. గతంలో ఒకరిని ప్రేమిస్తే అతను కూడా ఇదే కండీషన్ పెట్టడంతో ఆ బంధానికి గుడ్ బై చెప్పేశా. అలాగని నేను పెళ్లికి వ్యతిరేకం కాదు.. నాకు తగిన లక్షణాలు ఉన్న వ్యక్తి కనిపించినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. పాతికేళ్ల కుర్రాళ్లు కూడా డేటింగ్‌కు పిలుస్తున్నారు. నా దృష్టిలో వయసు అనేది ఓ నెంబర్ మాత్రమే. మానసికంగా పరిణితి, అనుకూలమైన వ్యక్తిత్వం ఉంటే నా వయసులో సగం ఉన్నవాళ్లను పార్ట్‌నర్‌గా ఎంచుకోవడానికి రెడీ అని అమీషా పటేల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: ameesha patel movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X