పురుషుడు పెద్దవాడైతేనే మజా .. నా కంటే 20 ఏళ్లు పెద్ద వ్యక్తితో అలా .. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ , రష్మిక మందన్న జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సికందర్. డివైడ్ టాక్‌లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో ఓ టాపిక్‌పై విస్తృతంగా చర్చ జరిగింది. అదే సల్మాన్ ఖాన్ - రష్మికల మధ్య ఏజ్ గ్యాప్. సినిమాల్లో నటీనటుల వయసును కాకుండా కేవలం పాత్రలనే చూడాలని ఎందరు హితవు పలికినా దీనిపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. చివరికి సల్మాన్, రష్మికలు స్వయంగా దీనిపై స్పందించినా విమర్శలకు చెక్ పడలేదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ ఇష్యూపై స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

రంజాన్ కానుకగా మార్చి 30వ తేదీన సికందర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అంతకుముందు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్, ఇతర చిత్ర యూనిట్ ఉత్సాహంగా పాల్గొంది. ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సల్మాన్ సమాధానమిచ్చారు. ఈ సమయంలోనే రష్మికతో మీకు 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని సల్మాన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. హీరోయిన్‌కు కానీ, ఆమె తండ్రికి కానీ లేని ఇబ్బంది మీకెందుకని బదులిచ్చారు. రష్మికకు పెళ్లయి పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ కుండబద్ధలు కొట్టారు.

Ameesha Patel reacts on Age Gap Between Salman Khan and Rashmika Mandanna In Sikandar

తన అందం, నటనతో ఒక ఊపారు అమీషా పటేల్. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమీషా.. తర్వాత పవన్ కళ్యాణ్ సరసన బద్రీలో నటించి తెలుగు వారి అభిమానాన్ని పొందారు. తెలుగు, హిందీలలో పలు చిత్రాల్లో నటించిన అమీషా పటేల్ తర్వాత రేసులో వెనుకబడ్డారు. ఆమె కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో సన్నీడియోల్ సరసన గదర్ 2తో ఆమె ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల లిస్ట్‌లో చేరింది.

ఒకప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించారు అమీషా పటేల్. యే హై జల్వాలో వీరి జంట ఆకట్టుకుంది. అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్నంతగా సల్మాన్ - అమీషాల జంట అద్భుతంగా నటించింది. సినిమాలతో పాటు సామాజిక అంశాలు, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా సల్మాన్ - రష్మికల వయసు తేడాపైనా అమీషా స్పందించారు. తన కెరీర్‌లో నా కంటే పెద్ద వయసున్న హీరోలతో నటించానని ఆమె గుర్తుచేశారు.

గదర్ -2లో సన్నీ డియోల్ తన కంటే 20 ఏళ్లు పెద్దవారని.. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యిందని అమీషా పటేల్ తెలిపారు. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని అమీషా తెలిపారు. సికందర్‌లో సల్మాన్- రష్మికల జోడి కూడా ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే సినిమాను ఆదరిస్తున్నారని ఆమె కుండబద్ధలు కొట్టారు. సికందర్ తనకు కూడా బాగా నచ్చిందని.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అమీషా పటేల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X