48 ఏళ్ల వయస్సులో బద్రి హీరోయిన్ బికినీ ట్రీట్.. ఘాటు అందాలతో గరం గరంగా అమీషా పటేల్
అమీషా పటేల్.. ఈ పేరు ఈ జనరేషన్ వాళ్లకు చాలా రేర్ ఏమో కానీ.. పవన ఫ్యాన్స్ ను అడిగి చూడండి.. ఏం మాట్లాడుతున్నారు.. మా బద్రి హీరోయిన్ గురించి మాకు తెలియదా అనేస్తారు. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా పటేల్ తెలుగుకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ హిట్ తో తెలుగులోనే సెటిల్ అవ్వాలని చూసింది కానీ, ఆ తరువాత అమ్మడికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
అప్పుడప్పుడు అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది. ఇక అమ్మడు కెరీర్ లో సక్సెస్ ఎంత ఉందో చెప్పడం కష్టం ఏమో కనై, వివాదాలు, పోలీస్ కేసులు ఎన్ని ఉన్నాయో మాత్రం టక్కున చెప్పొచ్చు. ఈ మధ్యనే చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఓ సినిమా నిర్మాణం కోసం రాంచీ జిల్లాకు చెందిన అజయ్ కుమార్ సింగ్ దగ్గర పదేళ్ల క్రితం రెండున్నర కోట్ల రూపాయలను అప్పు తీసుకున్న అమీషా సినిమా ఆగిపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని అజయ్‌కుమార్ ఒత్తిడి తెస్తే చెల్లని చెక్కులు ఇచ్చింది.

ఇక దీంతో అమీషాపటేల్ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో అజయ్‌కుమార్ కోర్టును ఆశ్రయించాడు. కోర్ట్ తీర్పు ఇవ్వకముందే ఆమె లొంగిపోయింది. ఈ మధ్యనే ఆమె బయటకు వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత మరో ఎత్తు. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు కుంకు లేకుండా చేస్తూ ఉంటుంది.
అమీషా వయస్సు 48. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఫేస్ లో కొద్దిగా ముదిరిన ముడతలు తప్ప.. అమ్మడు బాడీ మెయింటెనెన్స్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇక తాజాగా అమీషా బికినీ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలపు నలుపు కలగలిపిన చారలు ఉన్న బికినీలో ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. లేటు వయస్సులో ఘాటు అందాల ప్రదర్శన చేసిన ఈ ముద్దుగుమ్మపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.

అసలు ఈ వయస్సులో ఆ అందాల ఆరబోత ఏంటి.. కుర్ర హీరోయిన్ అనుకుంటున్నావా.. ? అని కొందరు. ఈ వయస్సులో కూడా ఫిగర్ బాగా మెయింటైన్ చేస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమీషా వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది గదర్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ హిట్ తరువాత మరోసారి స్టార్ హోదాను అనుభవిస్తుంది. మరి ముందు ముందు ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











