నిర్మాతపై తీవ్ర ఆరోపణలు చేసిన అమీషా పటేల్.. ఇంత అన్యాయమా? అంటూ వరుస ట్వీట్లు

తెలుగులో బద్రి, హిందీలో కహోనా ప్యార్ హై సినిమాలతో భారీ విజయాలు అందుకొన్న అమీషా పటేల్ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఆ తర్వాత స్టార్ స్టేటస్‌ను నిలుపుకోవడానికి తంటాలు పడింది. నిత్యం ఏదో వివాదాలతో సతమవుతున్న అమీషా.. అదే తీరుతో ముందుకెళ్తున్నది. పలు కోర్టు కేసులు, చెక్ బౌన్స్ కేసుల మధ్య ఎట్టకేలకు గదర్ సీక్వెల్‌ గదర్ 2 సినిమాలో నటించే ఆఫర్‌ను దక్కించుకొన్నది. అయితే గదర్ 2 నిర్మాతపై అమీషా పటేల్ ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆమె ఆరోపణల వివరాల్లోకి, కెరీర్ విషయంలోకి వెళితే..

Ameesha Patel

అమీషా పటేల్ ఇటీవల కాలంలో తాను నటించిన సినిమాల కంటే వివాదాలతోనే నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని భుజాన వేసుకొన్న ఈ అందాల భామ.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయింది. ఇక ఓ ఈవెంట్‌కు హాజరవుతానని ముఖం చాటేసిందనే విషయంలో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి.

Ameesha Patel

అమీషా పటేల్‌పై రాంచీలో దాఖలైన కేసుకు సంబంధించి ఆమె కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు విచారణకు హాజరుకావాలని ఇటీవల ఆదేశాలు రావడంతో కోర్టులో ఆమె ప్రత్యక్షమైంది.

Ameesha Patel

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గదర్ 2 సినిమాలో నటిస్తున్నది. సంచలన విజయం సాధించిన గదర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్ సరసన నటిస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు అమీషా ఏకంగా నిర్మాత అనిల్ శర్మపైనే సంచలన ఆరోపణలు చేసింది. దాంతో ఆమె ట్వీట్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అనిల్ శర్మ, ఆయన ప్రొడక్షన్ కంపెనీ సరిగా రెమ్యునరేషన్లు ఇవ్వడం లేదని వరుస ట్వీట్లు చేసింది.

అనిల్ శర్మ ప్రొడక్షన్ కంపెనీపై ఆరోపణలు చేస్తూ.. చాలా మంది మేకప్ ఆర్టిస్టులు, క్యాస్టూమ్ డిజైనర్లు, ఇతర సాంకేతిక నిపుణులకు డబ్బులు, రెమ్యునరేషన్లు చెల్లించడం లేదు. ఇలాంటి పనులతో సాంకేతిక నిపుణులు ఇబ్బంది పడుతున్నారు. జీ స్టూడియోస్ యాజమాన్యం రంగంలోకి దిగి నిపుణులకు రెమ్యునరేషన్లు చెల్లించాలి. జీ స్టూడియోస్‌ ప్రొఫెషనల్ కంపెనీ అనే పేరుంది. కాబట్టి వారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి అని ట్వీట్‌లో పేర్కొన్నది.

వసతి, చంఢీగడ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లినపుడు అయిన ట్రాన్స్‌పోర్టు ఖర్చులు, చివరి రోజు ఫుడ్ బిల్లులు ఇంకా చెల్లించలేదు. చాలా మందికి కారు సౌకర్యం ఇవ్వలేదు. అనిల్ శర్మ కంపెనీ చేసిన ఈ పనికి జీ స్టూడియోస్ యాజమాన్యం సరిదిద్దింది. ప్రతీ సమస్యను జీ స్టూడియోస్ పరిష్కరిస్తున్నది అని అమీషా పటేల్ ఆరోపణలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X