Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శృతిమించిన అమీషా పటేల్.. అందాలన్నీ ఓపెన్ చేసేసి!
బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీషా పటేల్ ఈ మధ్యకాలంలో శృతిమించి అందాలు ఆరబోస్తోంది. రోజుకో పిక్‌తో కుర్రకారు మనసు తన అందాలపై పడేలా గాలాలు వేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 43 సంవత్సరాలు. మరో రెండు రోజుల్లోనే ఇంకో ఏడాది ప్రమోషన్ తీసుకోబోతోంది. ఈ వయసులో కూడా అందాల ఆరబోత, ఆ అందాలన్నీ అదరహో అనిపించేలా ఉండటం చూసి ఆమెలో ఎంత హాట్నెస్ దాగి ఉందొ అర్థం చేసుకోవచ్చు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయిన ఈ లేడీ.. శృతిమించి అందాల విందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనలోని క్లీవేజ్ అందాలన్నీ ఓపెన్ చేసి కవ్వించింది. బ్లాక్ డ్రెస్ ధరించి లేటెస్ట్ ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ భామ దాదాపు టాప్ లెస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ హాట్ పిక్‌ని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసిన అమీషా.. లక్షల్లో లైకులు, కామెంట్లు కూడగట్టుకుంటోంది. 43 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ సోకుల మంటలు రేపింది అమీషా పటేల్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయినప్పటికీ ఇక్కడ మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ పట్టేయలేకపోయింది అమీషా. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఛాన్సులు వచ్చినా అవేవీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్‌కే మకాం మార్చిన ఈమె అక్కడ పలు సినిమాలతో అలరించింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్‌తో ఒక దశ వరకు తన రేంజ్‌ని మెయింటైన్ చేసింది అమీషా. ఇక మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్‌లలో కనిపిస్తున్న అమీషా ఈ వయసులో కూడా గ్లామర్‌తో ఇలా ఎటాక్ చేస్తుందంటే మరిన్ని అవకాశాలను టార్గెట్ చేసినట్లేగా లెక్క. అంటే తన గ్లామర్ అవుట్ డేట్ కాలేదని, తనలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని ఇలా అందాలన్నీ ఓపెన్ చేసేసి చెబుతోందన్నమాట అమీషా. ఇది కూడా అవకాశాలకు అద్భుతమైన మంత్రమే!