అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాన్ని అందుకోవడం ఎంతో కష్టం. ఒకసారి అందులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాణించాలంటే చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతంగా నటించగల నైపుణ్యం ఉంటే సరిపోదు. అదృష్టం కూడా కలిసి రావాల్సిందే. లేకపోతే అవకాశాలు రాక కెరీర్ మసకబారుతుంది. ఇలా ఎంతో మంది నటీమణులు ఇప్పటికే కనుమరుగైపోయారు.

అలాంటి వారిలో హాట్ బ్యూటీ అమీషా పటేల్ ఒకరు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. అవకాశాలను అందుకోలేక సినిమాలకే దూరమైపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా ప్రవేశం.. ఇలా పరిచయమైంది

అలా ప్రవేశం.. ఇలా పరిచయమైంది

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో అమీషా పటేల్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. ఇలా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. 'కహో నా ప్యార్ హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.

పవన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

పవన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

హీరోయిన్‌గా పరిచయమైన వెంటనే అమీషా పటేల్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చింది. ఇందులో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అమీషా.. అందంతో కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

అది మిగిలినవన్నీ నిరాశ పరిచాయి

అది మిగిలినవన్నీ నిరాశ పరిచాయి

తెలుగులో అమీషా పటేల్ నటించిన చిత్రాల్లో 'బద్రీ' ఒక్కటే హిట్ అయింది. దీని తర్వాత మహేశ్ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', బాలక‌ృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఇవన్నీ పరాజయాలు చవి చూశాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక, గ్యాప్ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది.

డైరెక్టర్‌తో ప్రేమాయణం.. బ్రేకప్ వల్ల

అమీషా పటేల్ కెరీర్ ఆరంభంలో ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. అయితే, క్రమక్రమంగా అన్నింటికీ దూరమైంది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుసగా నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దర్శకుడు విక్రమ్ భట్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి అతడితో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పెళ్లికి కొద్ది రోజుల ముందే అతడికి బ్రేకప్ చెప్పేసిందీ బ్యూటీ.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

దేశ వ్యాప్తంగా హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అమీషా పటేల్.. సోషల్ మీడియాలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఆమె దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచేసింది. అదే సమయంలో స్పెషల్ యాప్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ హాట్ టాపిక్ అవుతోంది.

అందాల విందు చేస్తూ చంపేస్తుంది

ఇంటర్నెట్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్.. తన అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ ఓ రేంజ్‌లో రచ్చ రచ్చ చేసేస్తోంది.

Recommended Video

Hero Raj Tarun Talks About Co-Stars In Orey Bujjiga Movie

అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయింది

సోషల్ మీడియాలో తరచూ హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే అమీషా పటేల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా బికినీతో కనిపించింది. అలాగే, కింద కూడా కేవలం క్లాత్ చుట్టుకుని ఫోజులిచ్చింది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X