పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు అరెస్ట్ ఉచ్చు.. ఏం జరిగిందంటే!

Recommended Video

Ameesha Patel In Legal Trouble Again, Charged With Rs. 2.5 Crore

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల సుందరి అమీషా పటేల్ కష్టాల్లో పడింది. రుణం ఎగవేత కేసులో ఇరుక్కొన్న ఈ బ్యూటీ కోర్టు సమన్లు అందుకొన్నది. దాంతో ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది. అమీషా చీటింగ్ వ్యవహారం కోర్టు పరిధిలోకి రావడంతో ఆమెకు కష్టాలు మొదలైనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదానికి కారణమేమిటి? ఎంత మేరకు అప్పుల ఎగవేతకు పాల్పడిందనే వివరాలు ఇవే..

సినిమా నిర్మాణం కోసం అప్పు చేసి

సినిమా నిర్మాణం కోసం అప్పు చేసి

గత కొద్దికాలంగా ఆఫర్లు లేక సినిమాలకు దూరమైన అమీషా తీసుకొన్న ఓ సాహసమైన బెడిసికొట్టింది. దేశీ మ్యాజిక్ అనే చిత్రం కోసం భారీగా అప్పు తీసుకొని సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా రిలీజ్ ఆగిపోవడం, తీసుకొన్న రుణం చెల్లించకపోవడంతో ఫైనాన్సియర్ అజయ్ కుమార్ సింగ్ కోర్టులో కేసు వేశారు. గత కొద్దికాలంగా ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. తాజాగా ఆమెకు నోటీసులు పంపి కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

అమీషాపై చెక్ బౌన్స్ కేసు

అమీషాపై చెక్ బౌన్స్ కేసు

ఫైనాన్సియర్ అజయ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అమీషా ఇచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో రాంచీ కోర్టులో కేసు నమోదు చేశాం. దేశీ మ్యాజిక్ సినిమా రిలీజ్ విషయంలో ఆమె స్పందించడం లేదు. తీసుకొన్న అప్పు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అందుకే ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లాను. ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసిన వార్త నిజమే అని అన్నారు.

కోర్టుకు హాజరుకాకపోతే అరెస్టే

కోర్టుకు హాజరుకాకపోతే అరెస్టే

అమీషా పటేల్ జూలై 8వ తేదీన కోర్టుకు హాజరుకావాలి ఉంది. ఒకవేళ ఆమె కోర్టుకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది. నోటీసులకు అమీషా స్పందించకపోవడం వల్ల ఆమెకు వారెంట్ ఇష్యూ చేయాలని కోర్టును జూన్ 17న కోరాం. అందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది. అరెస్ట్ వారెంట్‌ కంటే ముందు పోలీసుల ద్వారా సమన్లు అందించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నది అని అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

 తప్పించుకు తిరుగుతున్న అమీషా పటేల్

తప్పించుకు తిరుగుతున్న అమీషా పటేల్

ఇక దేశీ మ్యాజిక్ విషయానికి వస్తే.. 2013లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. అయితే సినిమా నిర్మాణం విషయంలో క్లారిటీ లేదు. దాంతో సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో సినిమా నిర్మాణం కోసం తీసుకొన్న రుణాన్ని ఇవ్వాలని ఫైనాన్సియర్ అజయ్ కుమార్ ఒత్తిడి చేయడంతో అమీషా తప్పించుకు తిరగడం మొదలుపెట్టింది. ఈ చిత్రంలో జాయేద్ ఖాన్, సాహిల్ ష్రాఫ్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X