చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలా ? 50 మంది మధ్య ఇరుక్కున్న నటి!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సక్సెస్పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఈ సినిమా, తొలి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వాతావరణానికి తగ్గట్టుగా కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్, కామెడీ, మెసేజ్‌తో ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తోంది. చిరంజీవి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలుతున్న చిరంజీవి, కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చిన నటుడిగా గుర్తింపు పొందారు. మూసపద్ధతిలో సాగుతున్న టాలీవుడ్‌కు దూకుడు నేర్పించి, ఫైట్‌లు, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన మేనరిజంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. తన బాడీని పాదరసంలా మెలికలు తిప్పే ఆయన డ్యాన్స్ అప్పట్లో యువతను మైమరపించింది. తెలుగు సినిమా మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడంలో చిరంజీవి పాత్ర అనిర్వచనీయమని చెప్పాలి.

ఇక వసూళ్ల పరంగా కూడా చిరంజీవి ఎన్నో రికార్డులు సృష్టించారు. భారతదేశంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 80's, 90's కిడ్స్ అంతా మెగా టానిక్ తీసుకున్నారు. ఆ టానిక్ వల్లే ఎంతోమంది ఇండస్ట్రీ వైపు వచ్చారు'అని వ్యాఖ్యానించారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని దర్శకులు, నిర్మాతలు, హీరోలు, టెక్నీషియన్లు ఇలా అనేకమంది సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అభిమానులకు ఆయన దైవసమానుడు. చిరంజీవి గురించి ఏ చిన్న మాట వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. ఈ క్రమంలోనే చిరంజీవిని తిట్టిన ఓ డైలాగ్ కారణంగా ఓ నటి ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి కెరీర్‌లో కీలక మలుపు తిప్పిన సినిమాల్లో హిట్లర్ (Hitler) ఒకటి. వరుస పరాజయాలతో చిరంజీవి కెరీర్ ముగిసిందన్న పుకార్లు వినిపించిన సమయంలో, ఈ సినిమా ఆయనకు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. మలయాళ బ్లాక్‌బస్టర్‌ను దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెలుగులో రీమేక్ చేయగా, 1997 జనవరి 4న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్, చిరంజీవి నట విశ్వరూపం, పాటలు అన్నీ కలిసి 'హిట్లర్'ను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించిన నటి మీనా కుమారి (Meena Kumari) ఆమె బుల్లితెర నటి. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. హిట్లర్ సినిమాలో ఓ సందర్భంలో 'రాక్షసుడా... నిన్ను చూస్తే భయంగా ఉంది' అనే డైలాగ్ తాను చెప్పాల్సి వచ్చిందని, అదే డైలాగ్ మెగా అభిమానులను హర్ట్ చేసిందని ఆమె తెలిపారు. ఒక రోజు షూటింగ్ కోసం ఒంగోలు వెళ్తుండగా సుమారు 50 మంది చిరంజీవి అభిమానులు తన కారును చుట్టుముట్టి గొడవ చేశారని, చివరికి అది సినిమా సీన్ మాత్రమే అని వివరించడంతో వారు శాంతించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన ఇప్పటికీ తనను భయపెడుతూనే ఉందని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ టాక్‌తో దూసుకుపోతున్న వేళ, చిరంజీవి కెరీర్‌లో హిట్లర్ లాంటి మైలురాయి సినిమా, అప్పట్లో అభిమానుల క్రేజ్ ఎలా ఉండేదో చూపించే ఈ పాత ఇంటర్వ్యూ మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అప్పుడు మెగాస్టార్ అభిమానుల అభిమానం ఎలా ఉండేదో, వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తు చేస్తోంది.


Click it and Unblock the Notifications











