ఆ హీరోతో డేటింగ్ రూమర్స్ వేళ.. హైదరాబాద్ నా రెండో ఇల్లు అంటున్న భాగ్యశ్రీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒకరు.'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందం, అభినయంతో మెప్పించి, వరుస అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఆమె సినిమాల కంటే వ్యక్తిగత విషయాలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ పోతినేనితో ఆమె ప్రేమలో ఉందనే రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?

రామ్, భాగ్యశ్రీ కలిసి నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాలో నటించారు. ఈ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందనే ప్రచారం జరిగింది. అంతేకాదు, రామ్ ఆమె కోసం ప్రత్యేకంగా పాట కూడా రాశాడని, ఈ స్నేహం పెళ్లి వరకు వెళ్లే అవకాశముందని పలు రూమర్స్ వచ్చాయి. అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో రామ్, భాగ్యశ్రీ ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. తాము మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇలాంటి రూమర్స్ నడుస్తున్న సమయంలోనే భాగ్యశ్రీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.

Amid Ram Pothineni Dating Rumours Bhagyashri Borse Calls Hyderabad Her Second Home

ఈ అమ్మడు ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా మారారు. తాజాగా హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే యాంకర్ సుమ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ అడిగిన సరదా ప్రశ్నలకు భాగ్యశ్రీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.

మీ నెటివ్ ఫ్లేస్ ఎక్కడ ? అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. "నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్" అని భాగ్యశ్రీ చెప్పింది. వెంటనే సుమ "ఔరంగాబాద్ కాకుండా ఇంకో హోమ్ ఏదైనా ఉందా?" అని ప్రశ్నించింది. దీనికి భాగ్యశ్రీ ఏమాత్రం ఆలోచించకుండా "సెకండ్ హోమ్ హైదరాబాద్. ఆల్రెడీ ఇల్లు కూడా ఉంది" అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటలతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే సుమ రియాక్ట్ అవుతూ..'కంగ్రాట్స్ భాగ్యశ్రీ.. వెల్కమ్ టు హైదరాబాద్. ఇప్పటికే దేశంలోని చాలా మంది ఇక్కడ స్థిరపడిపోయారు. మీరు కూడా అలాగే హైదరాబాద్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాం. అయితే ఈ మాటల అర్థం ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు'అంటూ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్ చేశారు సుమ. ఇక పక్కనే ఉన్న అఖిల్ అక్కినేని కూడా చిరునవ్వులు చిందించడం గమనార్హం.

అయితే యాంకర్ సుమ కామెంట్స్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమగారు అలా ఎందుకు మాట్లాడారు? ఇంతకీ అసలు అర్థమేంటీ ? ఆలోచిస్తున్నారు. అయితే.. ఇటీవల రామ్ పోతినేనితో భాగ్యశ్రీ డేటింగ్ రూమర్స్ వెలువడుతున్న వేళ యాంకర్ సుమ ఆ కోణంలో కామెంట్స్ చేసి ఉంది కావొచ్చని భావిస్తున్నారు. అయితే భాగ్యశ్రీ మాత్రం ఎక్కడా ఆ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి 'లెనిన్' సినిమాపైనే ఉందని తెలుస్తోంది. జులై 10న విడుదల కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X