అందుకే టాలీవుడ్ చిత్రాలు నచ్చవు.. అతిథి హీరోయిన్ హాట్ కామెంట్స్!
2007లో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ చిత్రం అతిథిలో బాలీవుడ్ బ్యూటీ అమృత రావు హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మరో తెలుగు చిత్రంలో ఈ భామ నటించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ.. నేను అతిథి చిత్రంలో నటిస్తున్న సమయంలోనే మూడు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ నేను అంగీకరించలేదు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాలు నాకు నచ్చకపోవడమే అని అమృత తెలిపింది.
టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు. దర్శకుడు కేవలం ఒక వస్తువువగా మాత్రమే హీరోయిన్లని చూపిస్తారు. అది నచ్చకే టాలీవుడ్ చిత్రాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు అమృత రావు తెలిపింది. అతిథి చిత్రంలో మాత్రం నా పాత్రకు ప్రాధాన్యత ఉంది. అందుకే ఆ చిత్రం చేశా.

ఆ చిత్ర షూటింగ్ సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీతో ఏర్పడ్డ అనుబంధాన్ని మాత్రం మర్చిపోలేను. ప్రతి రోజు మహేష్ ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. ఒక రోజు మహేష్ సతీమణి నమ్రత తన కోసం బ్రౌన్ రైస్ వండి పంపిందని అమృత గుర్తుచేసుకుంది. ప్రస్తుతం అమృతకు బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు లేవు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











