తల్లి కాబోయే లోపే పెళ్లి.. వెరైటీగా రోబో బ్యూటీ ఆలోచనలు
ఎంతైనా రోబో బ్యూటీ కదా! ఆ ఆలోచనలు డిఫెరెంట్ గానే ఉంటాయి లెండి. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ గా మారి ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టిన అమీ జాక్సన్.. ఈ సారి మరో వినూత్న నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గర్భవతి అయి కూడా ప్రియుడితో షికార్లు, విదేశీ ప్రయాణాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోంది. అయితే తాజా పెళ్లి విషయంలో ఆమె ఓ నిర్ణయానికి వచ్చిందట. అమీ తీసుకున్న ఆ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పెళ్లిపై అమీ ప్లాన్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ప్రియుడితో డేటింగ్.. ప్రెగ్నెంట్
హీరోయిన్స్ అన్నాక డేటింగ్ చేయడం, అది బ్రేకప్ కావడం.. ఆ తర్వాత మరొకరితో డేటింగ్ అంటూ వార్తలు రావడం కామన్. కానీ డేటింగ్ చేసి ఏకంగా ప్రెగ్నెంట్ కావడం, పైగా ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడం ఒక్క అమీ జాక్సన్ కే సాధ్యమేమో!. ప్రియుడు జార్జ్ పనాయొటోతో చాలాకాలం పాటు ప్రేమ మైకంలో మునిగిన ఈ రోబో బ్యూటీ పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది.

ఆ విషయం తెలిశాక నిశ్చితార్థం
అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండే అమీ జాక్సన్.. తాను ప్రెగ్నెంట్ అని తెలిశాక ప్రియుడితో నిశ్చితార్థం చేసుకొని తనలోని విలక్షణతను చాటుకుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అమీ జాక్సన్- జార్జ్ పనాయొటో నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రియుడు, బేబీ బంప్ ఫొటోలు పోస్ట్ చేయడంలో స్పీడ్ పెంచేసింది అమీ.

ఇంగ్లీష్ పిల్ల కదా! అందుకే
ఏ విషయంలో అయినా అమీ జాక్సన్ ఓపెన్ గానే ఉంటుంది. అందాన్ని ఆరబోయడమైనా, ప్రియుడితో రొమాన్స్, డేటింగ్ విషయాలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఇంగ్లీష్ పిల్ల అనిపించుకుంటోంది. ఇటీవలే గర్భం దాల్చిన ఈ భామ ప్రస్తుతం 7 నెలల గర్భంతో ఉంది. ఈ తరుణంలో పెళ్లిపై అమీ తీసుకున్న నిర్ణయం జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

తల్లి కాబోయే లోపే పెళ్లి
తల్లి కాబోయే లోపే ప్రియుడు జార్జ్ పనాయొటోని పెళ్లాడాలాని ఫిక్స్ అయిందట అమీ జాక్సన్. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం చేశారనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రేమ జంట.. మరో నెల రోజుల్లోపే పెళ్లి పీటలెక్కనుందని సమాచారం. ఇదంతా కాస్త కొత్తగా అనిపిస్తూ ఆశ్చర్యపరిచినా కూడా బ్రేకప్ అనేది లేకుండా చక్కగా ప్రియుడినే పెళ్లాడటం అమీలోని గొప్పతనం. ఏమంటారు? అంతేగా!.


Click it and Unblock the Notifications











