మిలియనీర్ బాయ్ ఫ్రెండుతో ముద్దుల్లో మునిగి తేలిన హీరోయిన్!
2.0 మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ అమీ జాక్సన్ ఇంకా ఆ హ్యాపీ మ్యూడ్ నుంచి బయటకు రాలేదు. ఈ ఆనంద సమయంలో క్రిస్మస్ వేడుకలు మొదలవ్వడంతో తన సొంతదేశం బ్రిటన్ వెళ్లిపోయింది. తన బాయ్ ఫ్రెండుతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకుంటోంది.
అమీ జాక్సన్ కొంతకాలంగా మల్టీమలియనీర్ జార్జ్ పనయోటోతో ప్రేమలో మునిగితేలుతోంది. ఈ ఏడాది క్రిస్మస్ అతడితోనే ఎంజాయ్ చేసిన అమీ అతడిని ముద్దుడుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

వైరల్ అవుతున్న ఫోటోస్
బాయ్ ఫ్రెండును ముద్దాడుతూ అమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత ఘాటైన ముద్దు ఫోటో షేర్ చేసిందంటే అతడితో ప్రేమ ప్రయాణంలో చాలా దూరం వెళ్లినట్లు చర్చించుకుంటున్నారు.

కొత్త ఇల్లు కొనుగోలు చేసిన అమీ
2.0 సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో అమీ జాక్సన్ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంట్లో జరుగుతున్న మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్.... ఫ్యామిలీతో పాటు, ఫ్యామిలీ లాంటి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నట్లు అమీ వెల్లడించారు.

బాయ్ ఫ్రెండ్ అలాంటోడా?
అమీ జాక్సన్ ప్రేమిస్తున్న... జార్జ్‌కు యూకెలో మల్టీ మిలియనీర్ ప్లేబోయ్ అనే పేరుంది. బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆడ్రియాస్ కుమారుడు. వీరికి యూకెలో చాలా లగ్జరీ హోటల్స్ ఉన్నాయి.

అమీ జాక్సన్
అమీ జాక్సన్ సినిమాల విషయానికొస్తే 2.0 తర్వాత ఆమె ఏ చిత్రానికి కమిట్ కాలేదు. ప్రస్తుతం కథలు వింటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











