twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనో పనికి రాని నటిని.. అమీ జాక్సన్ ఉద్వేగంగా

    By Rajababu
    |

    సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 2.0 చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టిన అందాల తార అమీ జాక్సన్ మంచి జోష్‌లో ఉన్నారు. అందం, అభినయంతోపాటు చక్కటి డ్యాన్సులతో అలరిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగన రనౌత్ వెల్లడించింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ..

    భారతీయ సినిమాలో భాగమై ఎంతో నేర్చుకొన్నాను. ఇక్కడ అనుకుంటే ఏదైనా సాధ్యమే. సెట్లో ఏదైన సమస్య ఎదురైతే వెంటనే పరిష్కారం లభిస్తుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించడం చాలా సులభం అని అమీ జాక్సన్ అన్నారు. గత ఏడేళ్లుగా సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది. ప్రతీ రోజు నాకు కొత్తగానే అనిపిస్తుంది. భాష రాకపోయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెరీర్ ముందుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది.

    Amy Jackson: I was useless before 2.0 movie

    భారతీయ సినిమా పరిశ్రమలో 3డీ టెక్నాలజీతో రూపొందిన అద్భుతమైన చిత్రం 2.0. హాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలతో పోల్చడం సరికాదు. నాకు 50 ఏళ్లు వచ్చిన ఈ చిత్రం మరుపురాని సినిమాగా మిగిలిపోతుంది. భారతీయ సినిమా చరిత్రలో 2.0 చిరస్థాయిగా మిగులుతుంది. 2.0 చిత్రంలో నటించడానికి ముందు వరకు నేను ఓ పనికి రాని నటిని. ఇప్పుడు నాకంటూ నటిగా ఓ గుర్తింపు వచ్చే చిత్రంలో నటించాననే తృప్తి కలిగింది అని అమీ జాక్సన్ వెల్లడించింది.

    సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలకు సిద్దమవుతున్నది. ఈ చిత్రం సుమారు 450 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. అద్బుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి అనుభూతి కలిగిస్తుందనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Actress Amy Jackson, who plays the female lead, spoke about 2.0, being a part of Indian cinema and her film career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X