స్విమ్ సూట్ లో చరణ్ హీరోయిన్ అరాచకం.. అలా చూపిస్తూ ఘోరంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఎంతమంది తెలుగు హీరోయిన్స్ ఉన్న ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీ యువతులను కూడా ప్రోత్సహిస్తోంది. అలా తెలుగు చిత్రసీమకు పరిచయమైన బ్యూటిలలో అమీ జాక్సన్ ఒకరు. బ్రిటన్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాతో తెలుగులోకి పరిచయమైంది ఈ బ్యూటి. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా మరో పిక్ వదిలింది ఈ హాట్ బ్యూటి.

మద్రాసీ పట్టణం సినిమాతో..
చాలా కాలం క్రితమే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. మొదట తమిళంలో 'మద్రాసీ పట్టణం' సినిమాలో ఆర్యోతో జోడి కట్టింది ఈ భామ. ఇదే సినిమాను తెలుగులో '1947 ఏ లవ్ స్టోరీ'గా డబ్ చేశారు. తర్వాత అనేక చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలా చాలా కాలం పాటు హవాను చూపించింది.

రామ్ చరణ్ మూవీతో తెలుగులోకి..
ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో జన్మించిన బ్రిటీష్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన 16వ ఏటలోనే మోడలింగ్ రంగంలో రాణించింది. దీంతో పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో భాగంగానే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

వ్యాపారవేత్తతో ప్రేమాయణం..
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పుడే అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత అతడితో అమీ జాక్సన్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం తగ్గించేసింది.

కొడుకుతోనే సమయం..
జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ఇకనైనా పెళ్లి చేసుకుంటారని అంతా భావీంచారు. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసి ఆ అనుకున్న వాళ్లందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తన బిడ్డతోనే సమయాన్ని గడుపుతూ వస్తోంది ఈ బ్యూటిఫుల్ భామ.

వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్..
సినిమాలు చేసినా ఫేమస్ అవనంతగా.. పెళ్లికి ముందే తల్లై అమీ జాక్సన్ ఫుల్ పాపులర్ అయింది. ఇక, ఇప్పుడు ఆమె ఒంటరిగానే ఉంటోందని అంతా అనుకున్నారు. కానీ, మరోసారి ఊహించని విధంగా ఈ అమ్మడు మరొక నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తూ..
సోషల్ మీడియాలో చాలా కాలంగా ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్ అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రెచ్చిపోతోంది. దీంతో ఈమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

వైట్ స్విమ్ సూట్ లో..
నిత్యం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హాట్ బ్యూటి అమీ జాక్సన్ తాజాగా మరో ఫొటో వదిలింది. వైట్ స్విమ్ సూట్ ధరించిన ఈ భామ తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. సముద్రం పక్కన ఉన్న ఓ ప్లేస్ లో స్మైల్ ఇస్తూ ఈ ఫొటోకు పోజు ఇచ్చింది అమీ. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఉన్న అమీ జాక్సన్ సమ్మర్ వరకు ఇంకా 207 రోజులు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











