twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్ల తల్లైనా సరే ఏ మాత్రం తగ్గడం లేదు.. అందాల ఆరబోతలో రెట్టింపు ఘాటుదనం!

    |

    విదేశీ భామ అమీ జాక్సన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లి అయి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రియుడు జార్జ్ పనైతో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక త్వరలోనే వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్.. మునుపటిలా మల్లెతీగలా మారిపోయింది. అందాల ఆరబోతతో కుర్రకారును ఫిదా చేసేస్తోంది.

    Recommended Video

    Amy Jackson Chilling With Boy Friend, Pics Goes Viral || Filmibeat Telugu
    కలిసి రాని అదృష్టం..

    కలిసి రాని అదృష్టం..

    తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అమీ జాక్సన్‌కు అదృష్టం అంతగా కలిసి రాలేదు. శంకర్ లాంటి దర్శకుడు సైతం రెండు అవకాశాలు ఇచ్చినా లక్ మాత్రం కలిసి రాలేదు. ఐ, రోబో 2 సినిమాలు అమీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాయి. ఇలా అమీకి అవకాశాలు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు.

    ఫోటోషూట్లతో వైరల్..

    ఫోటోషూట్లతో వైరల్..

    అమీ జాక్సన్ బ్రిటన్ భామ కావడంతో తెరపైనా అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడేది కాదు. అలాంటి సోషల్ మీడియాలో ఇక మామూలుగా ఉంటుందా?. బికినీ ఫోటోలతో నానా రచ్చ చేస్తూ ఉండేది. నిత్యం బీచ్‌ల వెంట కాబోయే భర్తతో చట్టాపట్టాలేసుకుని తిరిగేది. ఇక గర్భం దాల్చాక మరో మెట్టు ఎక్కి ఫోటోషూట్లతో రెచ్చిపోయింది

    గర్భవతిగా ఫోటో షూట్లు..

    గర్భవతిగా ఫోటో షూట్లు..

    గర్భం దాల్చాకా కూడా వెరైటీ ఫోటోషూట్లతో అమీ జాక్సన్ రచ్చ చేసింది. గర్భవతిగా ఉండి.. బికినీ ధరించి చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. చివరగా ఓ పండండి బాబు(ఆండ్రూ) జన్మించాక ఆనందంతో అందరికీ పరిచయం చేసింది. బాబుతో సంతోషంగా గడిపే క్షణాలన్నింటినీ పంచుకునేది.

     తాజా ఫోటోలు వైరల్..

    తాజా ఫోటోలు వైరల్..

    బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అమీ జాక్సన్‌ కాస్త బొద్దుగానే ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం తన పాత లుక్కులోకి వచ్చింది. ఓ పిల్లకు తల్లి అంటే నమ్మేట్టు లేనేలేదు. సన్నజాజిలా మునుపటి కంటే అందంగా తయారైంది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అమీ ఫోటోలు నెట్టింట వేడిని పుట్టిస్తున్నాయి.

    English summary
    Amy Jackson Latest Pics Goes viral. amy Jackson Now enjoying vacation with her fiancée george. her latest pics creates storms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X