Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
పిల్ల తల్లైనా సరే ఏ మాత్రం తగ్గడం లేదు.. అందాల ఆరబోతలో రెట్టింపు ఘాటుదనం!
విదేశీ భామ అమీ జాక్సన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లి అయి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రియుడు జార్జ్ పనైతో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక త్వరలోనే వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్.. మునుపటిలా మల్లెతీగలా మారిపోయింది. అందాల ఆరబోతతో కుర్రకారును ఫిదా చేసేస్తోంది.
Recommended Video
కలిసి రాని అదృష్టం..
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అమీ జాక్సన్‌కు అదృష్టం అంతగా కలిసి రాలేదు. శంకర్ లాంటి దర్శకుడు సైతం రెండు అవకాశాలు ఇచ్చినా లక్ మాత్రం కలిసి రాలేదు. ఐ, రోబో 2 సినిమాలు అమీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాయి. ఇలా అమీకి అవకాశాలు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు.
ఫోటోషూట్లతో వైరల్..
అమీ జాక్సన్ బ్రిటన్ భామ కావడంతో తెరపైనా అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడేది కాదు. అలాంటి సోషల్ మీడియాలో ఇక మామూలుగా ఉంటుందా?. బికినీ ఫోటోలతో నానా రచ్చ చేస్తూ ఉండేది. నిత్యం బీచ్‌ల వెంట కాబోయే భర్తతో చట్టాపట్టాలేసుకుని తిరిగేది. ఇక గర్భం దాల్చాక మరో మెట్టు ఎక్కి ఫోటోషూట్లతో రెచ్చిపోయింది
గర్భవతిగా ఫోటో షూట్లు..
గర్భం దాల్చాకా కూడా వెరైటీ ఫోటోషూట్లతో అమీ జాక్సన్ రచ్చ చేసింది. గర్భవతిగా ఉండి.. బికినీ ధరించి చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. చివరగా ఓ పండండి బాబు(ఆండ్రూ) జన్మించాక ఆనందంతో అందరికీ పరిచయం చేసింది. బాబుతో సంతోషంగా గడిపే క్షణాలన్నింటినీ పంచుకునేది.
తాజా ఫోటోలు వైరల్..
బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అమీ జాక్సన్ కాస్త బొద్దుగానే ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం తన పాత లుక్కులోకి వచ్చింది. ఓ పిల్లకు తల్లి అంటే నమ్మేట్టు లేనేలేదు. సన్నజాజిలా మునుపటి కంటే అందంగా తయారైంది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అమీ ఫోటోలు నెట్టింట వేడిని పుట్టిస్తున్నాయి.