Amy Jackson కాన్స్ రెడ్ కార్పెట్‌పై అమీ జాక్సన్ అర్ధనగ్న ప్రదర్శన.. మీడియా ముందు అలా అసౌకర్యంగా!
ప్రపంచ సినిమాకు వేదికగా నిలిచిన కాన్స్ ఫిలింఫెస్టివల్ 2023 తారలతో కళకళలాడుతూ రంజుగా సాగుతున్నది. 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు హోయలు ఒలికిస్తూ.. మరింత గ్లామరస్‌గా మార్చారు. భారతదేశం తరపున ఐశ్వర్యరాయ్, ఇషా గుప్తా, దీపిక పదుకోన్, సారా ఆలీఖాన్, ఊర్వశి రౌటేలా తదితరులు రెడ్ కార్పెట్‌పై తమ మార్క్ చాటుకొన్నారు. తాజాగా ఇండో బ్రిటన్ నటి ఆమీ జాక్సన్ కాన్స్ ఫిలింఫెస్టివల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. అమీ జాక్సన్ సృష్టించిన హంగామా విషయంలోకి వెళితే..
మాన్‌స్టర్ ప్రీమియర్‌కు: కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై అమీ జాక్సన్ నడిచి వస్తుంటే.. ఇంటర్నేషనల్ మీడియా కెమెరాలు భారీగా పని చెప్పాయి. కాన్స్‌లో జరుగుతున్న మాన్‌స్టర్ సినిమా ప్రీమియర్‌కు అమీ జాక్సన్ హాజరయ్యారు. మాన్‌స్టర్ సినిమా ప్రీమియర్‌లో అమీ జాక్సన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆమె అందాలను బంధించడానికి మీడియా కెమెరాలు పోటీపడ్డాయి.

లెగ్ స్లిట్ గౌన్‌లో తొడ అందాలు: కాన్స్ రెడ్ కార్పెట్‌పై అమీ జాక్సన్ ఎన్నడూ చూడని విధంగా అందాలను ఆరబోసింది. నలుపు రంగు డిజైనర్ దుస్తులతో దర్శనమిచ్చింది. లెగ్ స్లిట్ గౌన్‌లో తొడ అందాలను ప్రదర్శించింది. కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఎన్నడూ లేని విధంగా గ్లామర్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అమీ జాక్సన్ రెడ్ కార్పెట్ వాక్ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డిజైనర్ దుస్తుల్లో అసౌకర్యంగా: అమీ జాక్సన్ డిజైనర్ దుస్తులతోనే కాకుండా డిజైనర్ జ్యువెల్లరీతో మెరిసిపోయింది. డైమెండ్స్ పొదిగిన నెక్లెస్‌తో అందంగా కనిపించింది. చోకర్ నెక్లెస్, డైమెండ్ ఇయర్ రింగ్స్‌తో మరింత అందంగా కనిపించింది. అయితే అమీ జాక్సన్ ఓ దశలో అర్ధనగ్నంగా ఉన్న తాను మీడియా ముందు ఇబ్బంది పడింది. తన డ్రస్ కూడా తీవ్ర అసౌకర్యానికి గురిచేయడంతో మీడియా ముందు అనేక సమస్యలను ఎదుర్కొన్నది.

అమీ జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే..: అమీ జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళ సినిమా రంగంలో మద్రాసపట్టిణం అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రంలో నటించింది. తెలుగులో ఎవడు? కన్నడ సినిమాల్లో నటించిింది. హిందీలో ప్రతీక్ బబ్బర్‌తో ఏక్ దీవానా థా అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత సింగ్ ఈజ్ బ్లింగ్, ఫ్రీకీ అలీ చిత్రాల్లో కనిపించింది.


Click it and Unblock the Notifications











