Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమీ జాక్సన్ ను చూస్తే వామ్మో అనాల్సిందే.. ఎక్స్ పోజింగు అదుర్స్..
అమీ జాక్సన్ చేతిలో సినిమాలు లేకపోయినా.. జనాల నోళ్లో నానుతూనే ఉంటుంది. మొన్నటి వరకు బేబీ బంప్ ఫోటో షూట్లతో హల్చల్ చేసింది. ఇక తనకు ఓ కూతురు పుట్టాక.. మళ్లీ షరామామూలే హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఇంతకి ఆమె భర్త ఎవరని అనుకుంటున్నారా? ఇంకా పెళ్లి కాలేదులేండీ.. త్వరలోనే వారు పెళ్లి పీఠలెక్కనున్నారు.
పెళ్లి కాకముందే తల్లై..
పెళ్లి కాకముందే.. ప్రియుడు జార్జ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే గర్భం దాల్చిన అమీ.. ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఫోటోషూట్లు చేసింది. ప్రతీ రోజూ ఏదో ఒక అప్డేట్ పెడుతూ ఉండేది.
కుమారుడికి జన్మనిచ్చిన అమీ..
గత నెల 23న పండటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంలో పోస్ట్ చేసిన ఫోటోలో... తన బిడ్డ, భర్త ఉండగా.. వారెంత సంతోషంగా ఉన్నారో వారి మొహాలను చూస్తేనే తెలుస్తోంది.
తాజాగా పోస్ట్ చేసిన పిక్..
తన స్నేహితులు అన తనాకా పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన వారిద్దరి ఫోటో సోషల్ మీడియాను రచ్చ రచ్చ చేస్తోంది. ‘నన్నుఇన్స్పైర్ చేసే.. ఎంతో ప్రతిభ ఉన్నా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నీకు ప్రతీ ఏడాది ఇంకా ఇంకా బాగా జరగుతుందని.. అదే కర్మ ఫలితం. ఈ ఏడాది నీకు ఏవిదంగా ఉంటుందోనని చాలా ఆత్రుతగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది.
అమీకి కలిసి రాని లక్..
అమీ జాక్సన్ భారీ చిత్రాల్లోనే నటించినా.. లక్ మాత్రం కలిసి రాలేదు. ఇండియన్ డైరెక్టర్ శంకర్ ఐ, 2.ఓ సినిమాల్లో నటించినా తనకు పేరును తీసుకురాలేకపోయాయి. తెలుగులో ఎవడు సినిమాను చేసినా అంతగా ఉపయోగపడలేదు. తమిళ ఇండస్ట్రీలోనూ చెప్పుకోదగ్గ విజయాలేవీ అందుకోలేదు. అందుకే ఈ భామ తిరిగి తన దేశానికి చెక్కేసింది. మరి మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.