పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్.. గర్భంతో ఆటలాడుతున్న హీరోయిన్
తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బ్రిటీష్ భామ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే గర్బవతి కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనుకోకుండా తన ప్రియుడితో గర్భం వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి మీడియాలో తెగ ప్రచారానికి పాల్పడుతున్నది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వ బోతున్న అమీ జాక్సన్ తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతున్నది. వివారాల్లోకి వెళితే.
Recommended Video

33 వారాల గర్భంతో
అమీజాక్సన్ ఇటీవల ప్రసూతి ఫోటోషూట్ అంటూ పోస్టు పెట్టింది. గర్బంతో కూడిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ జరిగినప్పుడు ఆమెకు 33 వారాల గర్భం ఉంది. అర్ధనగ్నంగా నల్లటి డ్రస్‌లో కనిపిస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది. అయితే అంతటి ఎమోషనల్ జీవితంలో కూడా ఇలా ఫోజులిస్తూ అందంగా కనిపించేందుకు ప్రయత్నించడం గమనార్హం.

చిన్నారి గర్భంలో
తన ఫోటోషూట్ గురించి వెల్లడిస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. ఈ ఫోటోషూట్ జరిగేటప్పుడు బుల్లి చిన్నారి వయసు 33 వారాలు. ఈ ఫోటోషూట్‌ను చేసింది సమరా మోరీస్, సాండీ, రోజీ మేకప్ చేశారు అని తన పోస్టులో పేర్కొన్నది. చాలా సహజసిద్ధంగా అమీ జాక్సన్ ఈ షూట్‌లో కనిపించింది.

అనుకోకుండా గర్బవతినయ్యా
ఇటీవల మీడియాతో అమీ జాక్సన్ మాట్లాడుతూ.. ప్లాన్ చేయకుండా ప్రెగ్నెంట్ అయ్యాను. మాకు అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. అన్నీ ఫర్‌ఫెక్ట్‌గా చేయాలని ఆశపడొద్దు. అంతా మంచే జరుగుతుందనే ఫీలింగ్‌లో ఉన్నాం. మాకు అందమైన ఇల్లు ఉంది. అలాగే మంచి కుటుంబంగా మారబోతున్నాం అని చెప్పింది.

గర్భంతో ఊహించని మార్పులు
నా జీవితంలో ప్రెగ్నెన్సీ ఊహించని మార్పులు తెచ్చింది. మా బంధం మరింత బలపడింది. ఒకరినొకరం ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకొంటున్నాం. మంచేదో..చెడేదో బేరీజు వేసుకొంటున్నాం. ఇప్పుడు మమల్ని ఏ శక్తి విడదీయలేనంతగా మానసికంగా ధృడంగా మారాం అని అమీజాక్సన్ తెలిపింది.

ఘనంగా శ్రీమంతం వేడుక
ఇక లండన్‌లోని కొరింతియాలో శ్రీమంతం వేడుకను ఘనంగా అమీ జాక్సన్ జరుపుకొన్నది. ఈ వేడుకకు తన స్నేహితులను, సన్నిహితులను ఆహ్వానించింది. సెప్టెంబర్‌లోనే ఆమె ఓ చిన్నారికి జన్మనివ్వనుంది. ఈ మధురమైన క్షణాల కోసం వేచి ఉన్నాను అంటూ ఇటీవల అమీ జాక్సన్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











