ఒంటిపై నూలు పోగు లేదు.. న్యూడ్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన అమీ జాక్సన్
Recommended Video
రోబో బ్యూటీ అమీ జాక్సన్ టాప్ లెస్‌గా కనిపించి షాకిచ్చింది. తన బేబీ బంప్‌ని పూర్తిగా షో చేస్తూ తనలోని విలక్షణత చాటుకుంది. పైగా మాతృత్వం గురించి చెబుతూ తన ప్రెగెన్సీకి సంబందించిన అప్‌డేట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అమీ పోస్ట్ చేసిన ఈ పిక్, ట్యాగ్ లైన్ తెగ వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాలు చూద్దామా..

ముందు ప్రెగ్నెంట్.. ఆ తర్వాతే ఎంగేజ్‌మెంట్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ప్రేమలో మునిగితేలిన అమీ జాక్సన్.. ప్రెగ్నెంట్ అయ్యాక అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. లండన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్దానికి ముందే తాను గర్భవతిని అని తెలియగానే ఏ మాత్రం సందేహించకుండా ఆ విషయాన్ని తెలుపుతూ గర్భంతో ఉన్న ఫొటోలను అందరి ముందుంచింది అమీ. దీంతో ఆమె లోని డేర్‌నెస్ హాట్ టాపిక్‌గా అయింది.

అందరిలోనూ బిన్నం అన్నట్లుగా
సాధారణంగా ఏ హీరోయిన్ అయినా తనలో ఎంత హాట్‌నెస్ ఉన్నప్పటికీ గర్భవతి అయ్యాక కెమెరాకు దూరంగా ఉంటుంది. కానీ అమీ మాత్రం అనుదుకు భిన్నంగా గర్భంతో కెమెరా ముందుకొచ్చి మరింత హాట్‌గా దర్శనమిస్తోంది. పైగా ఈ ఫొటోలను స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి తన రూటే సపరేటు అని చెప్పేస్తోంది.
ఒంటిపై నూలు పోగు లేదు.. టాప్ లెస్ పోజు
ఇప్పటికే పలు ప్రెగ్నెన్సీ పిక్స్ షేర్ చేసిన అమీ.. తాజాగా టాప్ లెస్‌గా కనిపించి షాకిచ్చింది. ఒంటిపై నూలు పోగు లేకుండా తన బేబీ బంప్‌ని పూర్తిగా షో చేస్తూ న్యూడ్ పిక్ ట్వీట్ చేసింది. పైగా తలపై హాట్ ధరించి స్టైలిష్ పోజ్ ఇచ్చింది అమీ. ఈ లుక్ చూసి బ్రిటిష్ భామ భలే డేర్ ఫెల్లో అంటూ కామెంట వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

తన శరీరం గురించి గొప్పగా..
ఈ పిక్ ద్వారా తానా 33 వారాల ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసిన అమీ.. ''ప్రెగ్నెన్సీ ధరించినప్పటి నుంచి ఇప్పటిదాకా బరువు పెగరగటం, చర్మం సాగటం లాంటివి ఎన్నో జరిగాయి. మాతృత్వం అనేది చాలా గొప్పది. నా లోని మాతృత్వాన్ని గుర్తు ఈ ఫోటో. నా శరీరం సామర్థ్యం పట్ల గర్విస్తున్నాను'' అని పేర్కొంది.

పాత తరం ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెడుతూ
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అయ్యాక కెమెరాకు చిక్కొద్దు అనే పాత తరం ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది అమీ జాక్సన్. గర్భంతో మోడలింగ్ చేయకూడదా? వృత్తిలో భాగం కాకూడదా? అన్నట్లుగా అమీ వెళ్తున్న తీరు చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కొందరేమో టేక్ కేర్ అఫ్ యువర్ హెల్త్ అని కామెంట్స్ చేస్తుండగా మరికొంత మంది లవ్లీ, బ్యూటిఫుల్ అని కామెంట్ చేస్తున్నారు. రోబో యుగం కదండీ.. అందుకేనేమో అమీ ఏవీ అంతగా పట్టించుకోవడం లేదు.

రోబో బ్యూటీ
అమీ జాక్సన్.. ఇటీవలే రిలీజైన రోబో 2.0 సినిమాలో రజినీకాంత్ సరసన నటించింది. ఈ సినిమాలో అమీ అభినయం, అందాలు ఆమెను రోబో బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి.


Click it and Unblock the Notifications











