పాంట్ వేసుకోకుండా 'ఎవడు' హీరోయిన్ రచ్చ : తల్లైన తర్వాత కూడా మరీ ఇలానా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలా మంది సినీ సెలబ్రిటీలు సినిమాలు చేస్తున్నా లేకున్నా అనునిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండగలుగుతున్నారు. మళ్ళీ సినిమాల్లో అవకాశం కోసమో లేక తమ రియల్ లైఫ్ ను అభిమానులకు చూపించాలి అనుకుంటున్నారో తెలియదు కానీ తమ నిత్యజీవితంలో అనేక విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. మరీముఖ్యంగా మాజీ హీరోయిన్లు అయితే నలభై దాటుతున్నా మా అందం ఏమీ తగ్గలేదు అన్నట్టు తమ అందచందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ హాట్ ఫోటోల ద్వారా అను నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో అమీ జాక్సన్ ఒకరు.

నిజానికి ఆమె వయసు 30 ఏ, అయినా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. ప్రియుడితో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతానికి సినిమా ప్రపంచానికి దూరంగానే ఉంటున్నా తాను అభిమానులకు మాత్రం ఒక క్లిక్ దూరమే అని చెప్పేందుకు సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఆమె తాజాగా ఒక బెడ్ రూమ్ పిక్ షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

సినిమా మీద ప్రేమతో

సినిమా మీద ప్రేమతో

బ్రిటీష్ దేశానికి చెందిన అమీ జాక్సన్ సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇండియాలో అడుగు పెట్టింది. అయితే బాలీవుడ్ సహా దక్షిణాది సినిమాల్లో ప్రయత్నించగా ముందు తమిళంలోనే ఆఫర్ వచ్చింది. అలా ఆమె 'మద్రాసీ పట్టణం' అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన అమీ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టిన ఆమె ఆ సినిమా హిట్ అయినా పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోయింది. కానీ దర్శకుడు శంకర్ కంట పడడంతో ఆయన ఏకంగా 'ఐ', 'రోబో 2.0' వంటి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. కానీ అవి కూడా ఆమెకు కలిసి రాలేదు.

అవార్డులు వచ్చాయి కానీ

అవార్డులు వచ్చాయి కానీ

ఈ క్రమంలోనే బాలీవుడ్ మీద కన్నేసిన అమీ జాక్సన్ అక్కడ ప్రయత్నాలు అయితే చేసింది కానీ అవకాశాలు అయితే దక్కలేదు. దీంతో ఆమె మళ్ళీ దక్షిణాది మీద ఫోకస్ పెట్టింది. అలా కన్నడలో శివ రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. ఆ తరువాత ఆమెకు అసలు అవకాశాలే కరువయ్యాయి.

అమీ జాక్సన్ నటించింది కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. అందుకే ఆమె నటించిన చాలా సినిమాలకు అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకున్న ఆమె ఎందుకో కెరీర్ మీద ద్రుష్టి పెట్టలేదు అనే చెప్పాలి.

పెళ్ళికి రెడీ అయి

పెళ్ళికి రెడీ అయి

అయితే ఒక పక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అమీ డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. అయితే ఈ విషయాలు మనకు కొత్త కానీ అక్కడి వారికి చాలా కామన్. కానీ అమీ సినిమాల్లో ఉంది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు ప్రకటించింది.

పెళ్లి క్యాన్సిల్

పెళ్లి క్యాన్సిల్

జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్ రెండేళ్ల క్రితమే ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారితో కలిసి అడపాదడపా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అవుతున్నా అమీ జాక్సన్ పెళ్లి చేసుకోలేదు సరికదా ఆ మధ్య జార్జ్‌ పనాయొటోకు బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని పలు వార్తలు రావడంతో క్లారిటీ వచ్చింది. అయితే ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

హాటెస్ట్ ఫోటోలు

హాటెస్ట్ ఫోటోలు

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె మళ్లీ తన హాటెస్ట్ ఫోటోలను షేర్ చేసి తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఇండియన్ -బ్రిటీష్ నటి ప్రస్తుతం లండన్‌లో తన టైం స్పెండ్ చేస్తోంది. అలాగే ఆమె తాజా ఫోటోలను షేర్ చేసింది. ఆమె లండన్‌లోని తన అపార్ట్మెంట్ నుండి మంచి వ్యూ ని ఎంజాయ్ చేస్తోంది.

ఆమె తెల్లటి టీ షర్ట్ మాత్రమే ధరించడంతో అభిమానులు ఆ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. కింద ప్యాంట్ వేసుకోవడం మరచిందా అన్నట్టు కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి కనిపించింది. రెండు ఫోటోలు షేర్ చేయగా అందులో అమీ ఒక దానికోసం బెడ్‌పై పడుకుని పోజులివ్వగా, ఆపై ఆమె అద్భుతమైన బాల్కనీలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X