తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

సాధారణంగా సినీ రంగంలో లవ్ ట్రాకులు.. బ్రేకప్‌లు సర్వసాధారణమైన విషయాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది హాలీవుడ్‌లో అస్సలు పట్టించుకోని అంశాలుగా పరిగణిస్తారు. దీనికి కారణం అక్కడ ఇలాంటి వ్యవహారాలు తరచూ కనిపిస్తూ ఉండడమే. అయితే, ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ లవ్ ట్రాకులు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి కారణం ఆమె ఇండియాలోని పలు భాషల్లో సినిమాలు చేయడమే. గతంలో ఒకరితో ప్రేమాయణం సాగించి బిడ్డకు తల్లైన అమీ జాక్సన్.. ఇప్పుడు మరొకరితో డేటింగ్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె రొమాన్స్ చేస్తోన్న పిక్ ఒకటి షేర్ చేసింది. దీంతో అమీ జాక్సన్ మరోసారి హైలైట్ అవుతోంది. మరి ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఇండియాలో ఫుల్ పాపులర్

ఇండియాలో ఫుల్ పాపులర్

ఇంగ్లీష్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. దీంతో తన పాపులారిటీని భారీగా పెంచుకుంది.

డేటింగ్ చేస్తూనే ప్రెగ్నెంట్

డేటింగ్ చేస్తూనే ప్రెగ్నెంట్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో లవ్ ట్రాక్ నడిపింది. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. అలా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే అతడితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి రెడీ అయింది. ఇక, అప్పటి నుంచి అమీ సినిమాలకు దూరమైంది.

తల్లైన అమీ... బ్రేకప్ చెప్పి

తల్లైన అమీ... బ్రేకప్ చెప్పి

జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అనంతరం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి కాలం వెల్లదీస్తుంది. అదే సమయంలో సినిమాలను కూడా చేయట్లేదు.

మరో నటుడితో లవ్ ట్రాక్

మరో నటుడితో లవ్ ట్రాక్

ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ.. అమీ జాక్సన్ లవ్ ట్రాకుల పరంగానే హైలైట్ అయింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు ఓ వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. దీనికి కారణం అమీ అతడితో కలిసి పలుమార్లు కెమెరాల కంటికి చిక్కడమే. అప్పటి నుంచి వీళ్లిద్దరి వ్యవహారం గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

గతంలో వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య ఖాళీగానే ఉంటోన్నా అమీ జాక్సన్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా తరచూ ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.

లిప్ కిస్ ఫొటో వదిలింది

లిప్ కిస్ ఫొటో వదిలింది

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా రచ్చ రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె బెడ్‌పై పడుకుని లిప్ కిస్ పెట్టుకుంటోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకుంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

డౌట్లు పెంచేసిన బ్యూటీ

డౌట్లు పెంచేసిన బ్యూటీ

అమీ జాక్సన్ తాజాగా షేర్ చేసిన ఫొటోలో లిప్ కిస్ పెట్టుకుంటోన్న ఇద్దరి ముఖాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దీని గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇందులో ఉన్నది అమీ జాక్సన్‌ అని.. ఆ కిస్ పెట్టేది ఎడ్ వెస్ట్‌విక్‌కే అని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈమె ప్రేమలో ఉన్నది కూడా వాస్తవే అయి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X