First Photo: మూడో పెళ్లి చేసుకొన్న శృంగార తార.. తొలి ఫోటో ట్రెండింగ్!
బ్రిటన్‌కు చెందిన ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొన్నది. ఇటీవల రెండో భర్తతో విడాకులు తీసుకొన్న ఈ శృంగార తార గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియడిని పెళ్లాడింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా సాగిన ఈ వివాహం అనంతరం ఆమె తన మూడో పెళ్లికి సంబంధించిన తొలి ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
అమీ జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళ సినిమా మద్రాసీపట్నం అనే సినిమా ద్వారా భారతీయ సినిమారంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఏక్ దీవానా అనే హిందీ సినిమాలో నటించింది. అనంతరం రాంచరణ్‌తో కలిసి ఎవడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ది విలన్ అనే సినిమా ద్వారా కన్నడ చిత్ర రంగంలోకి ప్రవేశించింది. అలా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ రంగాల్లో రాణించింది.

బాలీవుడ్ యాక్టర్, ప్రముఖ నటి, స్వర్గీయ స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్‌తో సహజీవనం చేసింది. 2011 నుంచి 2012 వరకు వారి లివింగ్ రిలేషన్ బ్రేకప్ అయింది. దాంతో కొన్నేళ్లపాటు సింగిల్‌గానే ఉన్నారు.

ఆ తర్వాత పారిశ్రామికవేత్త జార్జ్ పనాయిటూతో 2015 సంవత్సరం నుంచి సహజీవనం చేసింది. వారిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకొన్నారు. వారిద్దరి డేటింగ్ జీవితం 2021 వరకు కొనసాగింది. అయితే సజావుగా సాగుతుందని అనుకొంటున్న సమయంలో వారి జీవితంలో అభిప్రాయ బేధాలు వచ్చి 6 ఏళ్ల లివింగ్ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికారు. అప్పటికే వారిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు.

ఇక సహజీవనం వర్కవుట్ కావడం లేదని భావించిన ఆమె.. తాజాగా ఇంగ్లీష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ అనే అతడితో అఫైర్ పెట్టుకొన్నది. చివరకు వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. దాంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొన్నది. తాజాగా వారిద్దరి తొలి ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











