13 గంటలు వ్యాన్‌లోనే నన్ను.. సౌత్‌లోనూ వేధింపులు.. వారి భరతం పడుతా.. అమీరా దస్తర్

విలక్షణ నటుడు నానా పాటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమ ఒక్క కుదుపుకు గురైంది. తమకు జరిగిన అన్యాయంపై ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు. తాజాగా అందాల తార అమీరా దస్తర్ కూడా లైంగిక వేధింపులను బయటపెట్టింది. తనను వేధించిన వాళ్లంతా సమాజంలో పెద్దలు, వారి పేర్లు బయటకు చెప్పే ధైర్యం లేదు. కానీ ఏదో రోజు వారి పేర్లను బయటపెడుతానని అమీరా దస్తర్ హెచ్చరించింది. ఆమె వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

 వేధింపులకు ఆడా మగ తేడాలేదు

వేధింపులకు ఆడా మగ తేడాలేదు

లైంగిక వేధింపుల విషయంలో ఆడ, మగ తేడా లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో, బాలీవుడ్‌లో ఆడవాళ్లు, మగవాళ్ల చేతిలో మోసపోయాను. చాలా దారుణంగా వేధింపులకు గురయ్యాను. వారి పేర్లు ఇప్పుడు వెల్లడించను. కానీ ఏదో రోజు వారి గురించి ప్రస్తావిస్తాను అని అమీరా వెల్లడించింది.

 బాలీవుడ్, సౌత్‌లోనూ కూడా

బాలీవుడ్, సౌత్‌లోనూ కూడా

బాలీవుడ్‌లోనో లేదా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనో లైంగిక వేధింపులకు గురయ్యాననుకొంటే పొరపాటే. ఈ రకమైన దారుణాలు అన్ని చోట్ల ఉన్నాయి. దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీలో వాళ్లు చాలా పవర్‌ఫుల్. అందుకే వారి గురించి చెప్పడం లేదు. ఆడ, మగ అనే తేడాలేకుండా నన్ను వంచించారు. ఆ పరిస్థితుల్లో వారితో పోరాడే శక్తి లేదు అని అమీరా దస్తర్ పేర్కొన్నది.

 ఏదో రోజు వారి భరతం పడుతాను

ఏదో రోజు వారి భరతం పడుతాను

ఇండస్ట్రీలో పెద్దల ముసుగులో ఉన్న వారి భరతం పడుతాను. ఎప్పుడైతే నేను సేఫ్ అని భావిస్తానో. అప్పడే వారివైపు వేళ్లను చూపిస్తాను. నేను మాట్లాడుతున్న తీరును బట్టి వారెవరో, వారు ఏం చేశారో అనేది వారికి తెలుసు. ఇకనైనా ఈ దారుణాలను ఆపాలి. ఇండస్ట్రీలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. వారు చేసిన పనులకు వారే కర్మను అనుభవించాల్సి ఉంటుంది.

హీరో నా చెవిలో గుసగుసలాడి

హీరో నా చెవిలో గుసగుసలాడి

నాకు ఓ సినిమాకు సంబంధించిన పాట షూట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ హీరో వచ్చి నా చెవిలో నీవు మా సినిమాలో నటించడం నాకు గర్వంగా ఉందని మీద పడ్డాడు. దాంతో ఆయనను తోసేశాను. ఆయన చేసిన పనిని చిత్ర యూనిట్‌కు చెప్పాను. దాంతో ఆయన నాపై చెడుగా మాట్లాడాడు. ఆ తర్వాత షూట్ ఉన్న రోజులు నాకు దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ హీరోకు నాతో క్షమాపణ చెప్పించారు.

 18 గంటలపాటు లొకేషన్లలోనే

18 గంటలపాటు లొకేషన్లలోనే

సినిమా షూట్‌లో నా పరిస్థితి దారుణంగా మారింది. డైరెక్టర్ వచ్చి సర్దుకుపోవాలని చెప్పాడు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు నుంచి నన్ను అందరి కంటే ముందే షూటింగ్‌కు పిలిచేవారు. చాలా గంటలు నన్ను వెయిట్ చేయించేవారు. దాదాపు 18 గంటలు నన్ను షూటింగ్ లొకేషన్లలో ఉంచేవారు. ఆ సమయంలో నేను కేవలం నాలుగైదు గంటలే నిద్రపోయాను అని అమీరా వెల్లడించింది.

13 గంటలు వ్యాన్‌లోనే

13 గంటలు వ్యాన్‌లోనే

మరో సినిమా షూట్‌లో నాతో ఓ డైరెక్టర్ దారుణంగా బిహేవ్ చేశాడు. ప్రతీ రోజు షూటింగ్‌లో నాపై అరిచేవాడు. ప్రతీ రోజు ఉదయాన్ని షూటింగ్‌కు పిలిచేవాడు. గంటల కొద్ది వ్యానిటీ వ్యానులో కూర్చుండే దానిని. సుమారు 12 లేదా 13 గంటలు కూర్చొన్న తర్వాత నాకు షూటింగ్ లేదని చెప్పేవాడు. నా సినిమాలో నీకు ఛాన్స్ దక్కడం నీకు గొప్ప అవకాశమని ఆ డైరెక్టర్ నాతో అనేవాడు.

 అమీరా దస్తర్ సినిమా కెరీర్

అమీరా దస్తర్ సినిమా కెరీర్

దక్షిణాదిలో అమీరా దస్తర్ మూడు, నాలుగు చిత్రాల్లో నటించింది. మనసుకు నచ్చింది. రాజుగాడు చిత్రాల్లో నటించింది. తమిళంలో అనేకన్ చిత్రాల్లో నటించింది. ఇషాక్ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X