Amyra Dastur: బికినీ అందాలతో దడ పుట్టిస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్.. సముద్ర అందాలను తలపించేలా..
గ్లామరస్ హీరోయిన్స్ బికినీలో కనిపించడం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయిపోయింది అనే చెప్పాలి. ఒకప్పుడు బికినీ వేశారు అంటే ఆ విషయం చాలా కాలం పాటు హాట్ టాపిక్ గా నిలిచేది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఆ టాక్ సర్వసాధారణంగా మారిపోయింది. కానీ కొంతమందికి మాత్రం ఒక్కసారి బికినీలో కనిపించినా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు.
అలాంటి వారిలో రాజ్ తరుణ్ సినిమా ద్వారా క్రేజ్ అందుకున్న హీరోయిన్ కూడా ఉంది. ఆమె మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇటీవల ఆమె సముద్రపు అందాలను కూడా డామినేట్ చేసే విధంగా బికినిలో చాలా అందంగా కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

20 లోకి రాకముందే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న క్యూట్ హీరోయిన్స్ లో అమైరా దస్తూర్ ఒకరు. ఈ గుజరాతి బ్యూటీ 20 ఏళ్ల లోకి రాక ముందే ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ముంబైలో చదువులు పూర్తి చేసి అక్కడే మోడల్ గా మంచి క్రేజ్ ను రాబట్టింది. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి.

హాటెస్ట్ బ్యూటీగా..
మొదట్లో కొన్ని మంచి సినిమాలు చేసిన అమైరా దస్తూర్ ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ ల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీకి గ్లామర్ విషయంలో మాత్రం మంచి క్రేజ్ దక్కుతోంది అనే చెప్పాలి. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అమైరా హాటెస్ట్ బ్యూటీలతో పోటీ పడుతోంది.

తెలుగులో ఫస్ట్ సినిమా
2013లో ఇజక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీ భాషల్లో కొన్ని అవకాశాలను అందుకుంది. ఇక తెలుగు లో మొదట ఆమె 'మనసుకు నచ్చింది' అనే సినిమా చేసింది. మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో క్రేజ్ అయితే తీసుకురాలేకపోయింది.

రాజ్ తరుణ్ సినిమాలో..
ఇక ఆ తర్వాత 2018లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన 'రాజు గాడు' సినిమాలో హీరోయిన్ గా నటించి పరవాలేదు అనే విధంగా సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ మళ్లీ ఎందుకు ఇటువైపు తిరిగి చూడలేదు. ఎక్కువగా హిందీలోనే సినిమా ఆఫర్స్ వస్తుండటంతో అక్కడే బిజీగా మారిపోయింది.

బికినిలో కొత్తగా..
ఇక రీసెంట్ గా ఈ హీరోయిన్ ఎవరు ఊహించని విధంగా బికినీలో దర్శనం ఇచ్చింది. సముద్రమంతా కనిపించేలా బీచ్ దగ్గర బికినీలో సెక్సీగా ఫోజులు ఇచ్చిన ఈ అమ్మడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాయి. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచిన ఉన్న అమైరా దస్తూర్ బికినీ లో మాత్రం నిత్యం కొత్తగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో భగీరథ అనే ఒక సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











