For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sridevi Soda Center ప్రమోషన్స్ కి ఆనంది దూరం.. గర్భవతంటూ ప్రచారం.. అసలు విషయం అదా?

  |

  తెలుగు అమ్మాయి ఆనంది ఎట్టకేలకు ఒక సాలిడ్ హిట్ కొట్టింది. బస్ స్టాప్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంది ఆ తర్వాత పెద్దగా తెలుగు తెర మీద కనిపించిన ఆనవాళ్లు లేవు. చాలా రోజుల తర్వాత శ్రీదేవి సోడా సెంటర్లో ఫుల్ లెంత్ రోల్ చేసిన ఈ భామ కొద్ది రోజులుగా మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా కనిపించడం మానేసింది. దీనికి కారణం ఆమె గర్భవతి అని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  MP Balashowry Vallabhaneni son Engagement.. చిరంజీవితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరయ్యారంటే!

  తెలుగులో గుర్తింపు దొరకక

  తెలుగులో గుర్తింపు దొరకక

  వరంగల్ కి చెందిన ఆనంది మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బస్టాప్ అనే సినిమాలో సీమ అనే ఒక అల్లరి పిల్ల క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన నాయక్ సినిమాలో బ్రహ్మానందం పెళ్లి చూపులు కి వెళ్ళిన పెళ్లి కూతురు గా నటించింది.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ అనే మరో సినిమాలో నటించినా ఆమెకు తెలుగులో గుర్తింపు దొరకలేదు.. అయితే తమిళంలో చేసిన రెండో సినిమాతోటే ఆమెకు మంచి క్రేజ్ లభించింది.

  Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

  కయాల్ సినిమా

  కయాల్ సినిమా

  కయాల్ సినిమా ద్వారా ఆమె ఏకంగా తమిళంలో పదుల సంఖ్యలో సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఎట్టకేలకు 2021 వ సంవత్సరంలో విడుదలైన జాంబీ రెడ్డి సినిమాలో కూడా ఆమె ఒక కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అలాగే సుధీర్ బాబు హీరోగా రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాలో శ్రీదేవి పాత్రలో నటించిన ఆనంది తెలుగు ప్రేక్షకులందరినీ మాయ చేసిందని చెప్పవచ్చు.

  Jacqueline Fernandez ED విచారణ పూర్తి, స్టేట్మెంట్ రికార్డు.. అసలు ఏమైందంటే?

  అసలు ఏమైంది ?

  అసలు ఏమైంది ?

  అయితే శ్రీ దేవి సోడా సెంటర్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ కూడా ఆమె కనిపించడం లేదు. అయితే అసలు ఏమైంది ? ఆమె ప్రమోషన్స్ లో ఎందుకు కనిపించడం లేదు ? అనే విషయాల మీద ఫోకస్ పెడితే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విషయం ఏమిటంటే తమిళంలో తాను నటించిన కొన్ని సినిమాలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించిన సోక్రటీస్ అనే వ్యక్తిని ఆనంది ప్రేమించి పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం వరంగల్లోనే ఈ ఏడాది జనవరి నెలలో జరిగింది.

  RRR ఒలివియా మారిస్ హాట్ & క్యూట్ ఫొటోస్.. ఎన్టీఆర్ పాట్నర్ మామూలుగా లేదుగా..

  అసలు విషయం ఏమిటంటే

  అసలు విషయం ఏమిటంటే

  ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆమెకు ఆరు నెలల గర్భం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ లో ఎక్కడా ఆమె కనిపించలేదని అంటున్నారు. నిజానికి ఆమెను ప్రమోషన్స్ కి తీసుకురావాలని దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేసినా చివరి నిమిషంలో ఈ విషయం వారికి తెలిసిందట. ముందు నుంచి ఆమె ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని చివరికి ఫోన్లు అందుబాటులోకి రాగానే తాను గర్భవతిని కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రాలేను అనే విషయం వెల్లడించినట్లు సమాచారం.

  RRR కోసం Radhe Shyam Thaggede Ley | Prabhas Vs RRR || Filmibeat Telugu
  గర్భవతి అనే కారణం

  గర్భవతి అనే కారణం

  మరో కారణం అయితే దర్శక నిర్మాతలు పట్టుబట్టి ఉండేవారు కానీ గర్భవతి అనే కారణం చెప్పడంతో ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అయితే మంచి పాత్ర పడింది ఇక మీదట సినిమా అవకాశాలు తెలుగులో లభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఇలా గర్భం కారణంగా మళ్లీ సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తమిళంలో ఎప్పుడైనా ఆమెకు అవకాశాలు లభించే చాన్స్ ఉంది. ఎందుకంటే భర్త స్వయానా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి కాబట్టి ఆమె మళ్లీ తమిళంలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

  English summary
  As per reports Anandhi is pregnant. It is heard that she is in the seventh month of her pregnancy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X