మరింత బోల్డుగా అనంగ్షా.. హోస్టేజ్ 2 యమ క్రేజీగా
వెబ్ సీరీస్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో నటిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకొనేందుకు వర్థమాన తార అనంగ్షా బిశ్వాస్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రల్లో కనిపించిన అనంగ్షా బిశ్వాస్ మరోసారి తన నటనా ప్రతిభకు మెరుగులు పెట్టింది. తాజాగా విడుదలైన హస్టేజ్ 2 వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో మంచి మార్కులు సంపాదించుకొన్నారు. సెప్టెంబర్ 9న రిలీజైన హోస్టేజ్ 2 వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. రిలీజ్ రోజున సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది.
ఈ క్రమంలో అనంగ్షా బిశ్వాస్ హోస్టేజ్ 2లో తన పాత్ర గురించి చెబుతూ.. నటుడు రోనిత్ రాయ్ నటనలో ఓ ఎన్‌సైక్లోపీడియా. ఆయనతో నటించడం ద్వారా పలురకాల విషయాలు తెలుసుకొన్నాను. ఆయనతో మాట్లాడటం వల్ల నటనలో మెలుకువలు తెలుసుకొన్నాను. కెరీర్ ఆరంభంలో రోనిత్ రాయ్‌తో నటించడం గొప్ప అనుభవం. ఇక దర్శకుడు కృష్ణన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటుల నుంచి ప్రతిభను చాలా సులభంగా రాబట్టుకొనే డైరెక్టర్. మళ్లీ మళ్లీ తనతో పనిచేయాలని అనుకొంటున్నాను అని అన్నారు.

అనంగ్షా బిశ్వాస్ కేవలం బుల్లితెరకే పరిమితం కాలేదు. ఖోయా ఖోయా చాంద్ చిత్రంలో సారా ఆలీ ఖాన్, షైనీ అహుజా, రజత్ కపూర్‌తో నటించారు. లవ్ శువ్ తే చికెన్ ఖఉరాన, బెన్నీ బాబో లాంటి చిత్రాల్లో నటించారు. హోస్టేజ్ 2 చిత్రం ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. త్వరలోనే విడుదల కానున్న మీర్జాపూర్ 2లో కూడా ఆమె నటించారు.


Click it and Unblock the Notifications











