అప్పుడు అలా.. ఎప్పుడు ఇలా పరువు పోయింది.. సంస్కారం లేదా?.. అనన్య నాగళ్ల

Ananya Nagalla: యంగ్ అండ్ బ్యూటీపుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ 'వకీల్‌ సాబ్‌'లో నటించడంతో మరింత పాపులర్టీ సొంతం చేసుకుంది.ఆ తరువాత చిన్న సినిమాల్లో నటించిన ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ అమ్మడు సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'పొట్టేల్' సినిమా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తన జీవితంతో ఎదుర్కొన్న ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అందాల భామ 'మల్లేశం' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో అనన్య నాగళ్లకు నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాతో అనన్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఈ భామకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.

Ananya Nagala shared many interesting things about the hardships she faced in her life in pottel movie promotions

వకీల్ సాబ్ తరువాత అనన్య .. ప్లే బ్యాక్, శాకుంతలం, అన్వేషి, తంత్ర, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో తెరకెక్కిన పొట్టేల్ మూవీలో నటిస్తోంది. యంగ్ హీరో యువ చంద్ర కృష్ణ సరసన అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కానున్నది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ లో అనన్యకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా? అని ఓ లేడీ జర్నలిస్ట్‌ ఆమెను ప్రశ్నించడం.. ఇండస్ట్రీలోనే కాదు, సామాజిక మాధ్యమాల వేదికగానూ తీవ్ర చర్చకు దారి తీసింది.

తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను మీడియాతో పంచుకుంది. తాను సినిమాలోకి రాకముందుకు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, ఈ మూవీ హీరో యువ చంద్ర కూడా అక్కడే పని చేసేవాడని, అప్పట్లో ఇవా షార్ట్ ఫిలిమ్స్ తీసేయబడని, వాళ్ళ టీం ను చూసి తాను కూడా సినిమాలోకి వెళ్లాలని ఆలోచన వచ్చిందని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది.

అనంతరం జాబ్ మానేసి.. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో పలు ఆడిషన్లకు వెళ్లానని, ఇలా తనకు మల్లేశం అనే మూవీలో తొలుత అవకాశం వచ్చిందని తెలిపింది. తొలి సినిమా ఫేమ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఆ సినిమాతో తనకి ఎంతో గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే వకీల్ సాబ్ మూవీ తర్వాత లాక్ డౌన్ వచ్చిందని, చేతుల్లో సినిమా లేవని, మరోవైపు జాబ్ కూడా మానేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో అనవసరంగా సినిమాలలో కి వచ్చానని పలుమార్లు బాధపడ్డానని అన్నారు.

ఒక సంవత్సరం పాటు తాను ఖాళీగానే ఉన్నానని ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఎమోషనల్ అయింది. కానీ, ఇప్పుడు వర్షం సినిమాలో చేస్తున్నానని ఒకప్పుడు తనతో సాఫ్ట్వేర్ కంపెనీలో కొలీగ్ గా పనిచేసిన వ్యక్తితో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో తన మూవీ పొట్టేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సమయంలో కమిట్మెంట్ అంటూ డైరెక్ట్ గా స్టేజిపై ఉన్న నటిని సున్నితమైన విషయం గురించి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తాను ఇంటికి వెళ్లి చాలా ఆలోచించానని, ఆ ప్రశ్న తనను చాలా వేధించిందని చెప్పుకొచ్చారు. సంస్కారం ఉంటే.. ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా.. అనుకున్నానని తెలిపారు.

Ananya Nagala shared many interesting things about the hardships she faced in her life in pottel movie promotions

మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. ఆ కల కోసం దాదాపు ఐదు సంవత్సరాలు తాను ఇంట్లో వారితో ఫైట్ చేశానని తెలిపారు. ఆ ప్రశ్నతో కొంతమంది తనని ఇండస్ట్రీలోకి వెళ్లి ఇంటి పరువు తీసిందని అవమానించారన్నారు. కానీ, పొట్టేల్ సినిమా చూసిన తర్వాత.. మా ఇంట్లో అందరూ గర్వంగా ఫీల్ అవుతారని అనుకుంటున్నా.. ఇంత గొప్ప సినిమాలో మా అమ్మాయి నటించిందని, మా అమ్మ అందరితో చెబుతారని చాలా ఆనందిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

నిజంగా ఆనాడు అలాంటి ప్రశ్న వేసి తన ఆనందాన్ని దూరం చేశారని బాధపడ్డారు. ఆ సమయంలో తనకు మీడియా నుండి సపోర్టు ఇవ్వడం తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. హీరోయిన్లు మేకప్ వేసుకుని ఇప్పుడు నవ్వుతూనే ఉంటారని అనుకోవడమే కాదు. వారికి కూడా హృదయం ఉంటుందని, ఒక కుటుంబం ఉంటుందని, మమ్మల్ని కూడా గౌరవించాలని హీరోయిన్ అనన్య నాగళ్ళ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X