Ananya Nagalla: పడుకొంటే ఓ రెమ్యునరేషన్.. లేకపోతే మరో రేట్.. అనన్య నాగళ్ల దిమ్మతిరిగే జవాబు

యంగ్ అండ్ బ్యూటీపుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ 'వకీల్‌ సాబ్‌' మూవీలో నటించడంతో ఆ పాపులర్టీ మరింత పెరిగింది. ఆ తరువాత చిన్న సినిమాల్లో నటించిన ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు.

తాజాగా ఈ అమ్మడు ఓ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ ట్రైలర్ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై ఓ రిపోర్టర్ తేడాగా ప్రశ్నించగా.. అనన్య నాగల్ల కూడా దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ లూక్కేయండి.

Ananya Nagalla befitting reply on commitment in the Industry and casting couch at pottel event

అసలేం జరిగిందంటే..?

హీరోయిన్ అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పొట్టేల్' (Pottel). ఈ మూవీకి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తుండగా.. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ వస్తోంది. ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ (Trailer) ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విడుదల అనంతరం ప్రెస్ మీట్ లో మూవీ టీం మాట్లాడారు. ఈ క్రమంలో హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు ఓ లేడీ రిపోర్టర్ టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై డిఫెరెంట్ క్వచ్చన్ వేసింది. ఈ క్రమంలోనే హీరోయిన్ అనన్య కూడా తనదైన రీతిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

Ananya Nagalla befitting reply on commitment in the Industry and casting couch at pottel event

ఇంతకీ ఏం ప్రశ్నేంటీ? ... 'ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు రావడానికి భయపడతారు. అందులో ఒకటి కాస్టింగ్ కౌచ్. హీరోయిన్ కి సినిమాల్లో అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ (commitment) అడుగుతారంట నిజమేనా? ఇది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదుర్కొన్నారా ? అని లేడీ రిపోర్టర్ ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు అనన్య సమాధానమిస్తూ.. మీరు ఇంత క్లియర్ ఎలా చెప్పగలుగుతున్నారు? అని తిరిగి ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ రిపోర్టర్ 'అగ్రిమెంట్లో కూడా కమిట్మెంట్ ఉంటుందనీ ఇండస్ట్రీలో కొంతమంది చెబుతున్నారు' అనగా.. ' మీ అనుకుంటుంది 100% రాంగ్. తాను ఎప్పుడు అలాంటి అనుభవాన్ని ఎదుర్కొలేదు. ఇండస్ట్రీలో ఎక్కడో చోట ఇలాంటివి ఉండొచ్చు. ప్రతి ఇండస్ట్రీలో 50% కరెక్ట్ 50% రాంగ్ ఉంటుంది. కానీ, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ ఇస్తారనడం బుల్షిట్' అంటూ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది హీరోయిన్ అనన్య.

అక్కడితో ఆ రిపోర్టర్ ఆగకుండా..' కమిట్మెంట్ ఇస్తే.. ఒక రేటు.. ఇవ్వకపోతే మరోక రేటు.. ఉంటుందట కదా అని మళ్లీ ప్రశ్నించింది. దీంతో కాస్త ఆగ్రహానికి గురైన అనన్య.. మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎలా మాట్లాడుతారు? కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని మాట చెబుతున్నారు కదా.. నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా .. అలాంటివి ఇండస్ట్రీలో లేవు అంటూ హీరోయిన్ అనన్య స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ రిపోర్ట్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ananya nagalla commitment pottel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X