వావ్.. అనన్య నాగళ్ల భేష్..కోట్లు తీసుకొనే ఆ స్టార్ హీరోయిన్లకు మానవత్వం లేదా? నెటిజన్ల ఫైర్
ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ లో తెలుగు సినిమా ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అనేది అందరికీ తెలుసు. కాగా తెలుగు స్టేట్స్ లోనే భారీ సంఖ్యలో థియేటర్స్ కూడా ఉండడంతో మన దగ్గర నుంచి భారీ రెవెన్యూ కూడా జెనరేట్ అవుతుంది. అందుకే హిందీ మార్కెట్ హీరోలు కూడా దాదాపు మన దక్షిణాది మార్కెట్ లో ఉన్న ఇతర భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ పైనే కన్నేస్తారు.
కాగా ఇలా తెలుగు మార్కెట్ లో నార్త్ నుంచి హీరోలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలో ఎప్పుడు నుంచో ఉంటూ అనేకమంది హీరోయిన్స్ ఎంతో ఆదరణ తెలుగు ఆడియెన్స్ నుంచి అందుకొని కోట్లు గడించిన వారు లేకపోలేరు. కాగా ఇలా చాలామంది హీరోయిన్స్ ని మనం స్టార్ హీరోయిన్స్ గా చేసి పంపించాం కానీ వాళ్ళు మన దగ్గర నుంచి మార్కెట్ ని క్రేజ్ ని తీసుకున్నారు కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కష్టం వస్తే మాత్రం ఇప్పుడు నిలబడలేకపోయారని చెప్పాలి.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలో తెలుగు సినిమా హీరోలు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. మరి వేయిరి అందరి సరసన మన తెలుగు రాష్ట్రాల జనాభా కోసం కేవలం ఒకే ఒక్క హీరోయిన్ నిలిచింది. ఆమెనే "వకీల్ సాబ్" ఫేమ్ యువ నటి అనన్య నాగళ్ళ.
మన తెలుగు హీరోయిన్ అయ్యిన ఈమె పలు చిత్రాలు హీరోయిన్ గా ఇంకా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్టార్ హీరోయిన్స్ అయ్యే రేంజ్ మేటర్ తనలో ఉన్నప్పటికీ తెలుగు హీరోయిన్ కావడంతో మన దగ్గర అవకాశాలు సరిగ్గా లేకుండా పోయాయి. మరి ఈ హీరోయిన్ తన సంపాదన నుంచి 5 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇలా ఇన్నేళ్ల నుంచి ఉంటున్న ఎందరో స్టార్ హీరోయిన్స్ చెయ్యలేనిది ఈ ఒక్క యువనటి మాత్రమే చేసింది.

దీనితో తన స్పందించే హృదయం చూసి చాలా మంది ప్రశంసలు ఆమెపై కురిపిస్తూ తెలుగు సినిమాలో స్టార్ హీరోయిన్స్ గా చేసి కోటాను కోట్ల రెమ్యునరేషన్ లు తీసుకున్న హీరోయిన్స్ ఈ యువ నటిని చూసి బుద్ది తెచ్చుకోవాలి అంటూ గట్టి విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇకనైనా మన తెలుగు ప్రేక్షకుల కోసం ఆలోచిస్తున్న మన తెలుగు హీరోయిన్స్ ని సినిమాల్లో తీసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ విషయంలో డిమాండ్ చేస్తున్నారు.
తెలుగులో కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ లో సమంత, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా, తమన్నా ఇలా చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళెవరూ కనీసం స్పందించలేదు. ఇలాంటి వారు అంతా అనన్యని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటున్న నెటిజన్స్ మాటల్లో నిజం లేకపోలేదు అని చెప్పొచ్చు. మరి ఇప్పటికి అయినా ఆ హీరోయిన్స్ ఏమన్నా స్పందిస్తారో లేక మౌనంగానే ఉంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











