Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Ananya Nagalla: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల హాట్ షో: అలా చూపిస్తూ ఘోరంగా!
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తోంది. సాధారణంగా చిన్న క్యారెక్టర్లు పోషించే వారికి అంతగా ఫేమ్ దక్కదు. కానీ కొందరికి మాత్రం చేసింది చిన్న పాత్రలైనా, అరకొర సినిమాలైన మంచి పాపులారిటీ దక్కుతుంది. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. అయితే, అదంతా గతం అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. దీనికి కారణం ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడమే. దీంతో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. సినిమాలే కాకుండా నెట్టింట్లో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోన్న తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.

విమర్శకుల నుంచి ప్రశంసలు..
క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది.

కమెడియన్ టైటిల్ రోల్ చేసిన..
బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తిప్పేసుకుంది.

బ్యూటిఫుల్ హీరోయిన్స్ పక్కన..
మల్లేశం సినిమాలో అతనికి భార్యగా, ఇల్లాలిగా ఆ పాత్రలో అందంగా ఒదిగిపోయింది అనన్య నాగళ్ల. ఆమె యాక్టింగ్‌కు చాలా మంది ముఖ్యంగా యువత ఫిదా అయింది. దీంతో అనన్య నాగళ్లకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయిన అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది అనన్య నాగళ్ల.

నితిన్ రీమేక్ చిత్రంలో..
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నితిన్ రీమెక్ చిత్రం 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

సినీ కెరీర్ విషయాలపై..
అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతోపాటు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

ఎద అందాలను ప్రదర్శిస్తూ..
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది.

గ్రీన్ కలర్ డ్రెస్ లో వయ్యారంగా..
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల చేతులు పైకెత్తి తన నడుము అందాలను ప్రదర్శించింది. అలాగే కుర్చీపై వయ్యారంగా కూర్చొని తన ఎద భాగాలు కనపడేలా పోజులిచ్చింది. బ్యూటిఫుల్ స్మైల్ తో అనన్య నాగళ్ల దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.