బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు
తెలుగులో ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హడావిడి చేస్తున్నారు. అందులో లోకల్ బ్యూటీలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు. అందులో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సందడి చేస్తోంది అనన్య నాగళ్ల. తనదైన అందం, అభినయంతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా అనన్య కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అప్పుడే సైమా అవార్డు సొంతం
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కోరికతో అనన్య నాగళ్ల యాక్టింగ్‌లో కోర్సులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఈ భామ 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డును కూడా అందుకుంది.

హీరోయిన్‌గా... పవన్ సినిమాలో
'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సహజసిద్ధమైన నటనతో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య భాగం అయింది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలోనూ మంచి నటనతో మరింత గుర్తింపును తెచ్చుకుంది.

హిట్లు మీద హిట్లుతో దూకుడు
అనన్య నాగళ్ల హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత పలు సినిమాల్లో మాత్రమే చేసింది. అయితేనేం అవన్నీ ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతూనే వస్తున్నాయి. ఇలా గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరొచ్చింది.

వరుసగా సినిమాలు చేస్తోంది
తెలుగు అందం అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవడంతో.. ఆమెకు ఆఫర్లు మరింతగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుంది. అందులో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీ ఒకటి. దీనితో పాటు మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులను సైతం మొదలెట్టేసింది. తద్వారా బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో సందడిగా
ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాల వల
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో అనన్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటూ తెగ హైలైట్ అయిపోతోంది.

అనన్య క్లీవేజ్ షో పిక్స్ వైరల్
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ డ్రెస్‌లలో క్లీవేజ్ షో చేసేలా ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తూనే ఉంటోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











