‘అతని చేతుల్లో అలా మోసపోయా... ఆ క్యారవాన్‌లో గుండె బద్ధలయ్యేలా’

టాలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో అనన్య నాగళ్ల కూడా ఒకరు. అందంతో పాటు అభినయంతో అవకాశాలు అందుకుంటున్నారు అనన్య. మల్లేశం, పొట్టేల్, తంత్ర, వకీల్ సాబ్ తదితర సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న అనన్య కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల చదువులో టాపర్. వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. బీటెక్ తర్వాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు వర్క్ చేశారు. అయితే నటనపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ దశలో మల్లేశం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. అనంతరం ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీపెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాలలో అనన్య నటించారు.

Ananya Nagalla Opens Up About Painful Breakup and Film Career

ఒక స్క్రిప్ట్‌ను ఎంచుకోవడం, యాక్టింగ్ చేయడం.. ఆ సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే నేను చేసేవన్నీ చాలా చిన్న సినిమాలు. ఒకవేళ రిలీజ్ వరకు తీసుకొచ్చినప్పటికీ .. ప్రమోషన్ చేయడం, జనానికి తెలియజేయడం టఫ్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కనీసం ప్రజలు ఏదో ఒక రిజల్ట్ ఇవ్వడానికైనా సినిమా రిలీజ్ కావాలి కదా. కానీ ఆ అవకాశం కూడా మనకి రానప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. నేను చిన్న సినిమాలు చేసినా ప్రేక్షకులు దానిని చూడాలని ప్రమోషన్స్‌ని భుజాల మీద వేసుకుంటా. ఇంతమంది కష్టాన్ని ప్రేక్షకులకు చూపించాలని అనిపిస్తుందని అనన్య తెలిపారు.

ఇటీవలి కాలంలో దేని గురించైనా ఏడ్చావా? ఎందుకు ఏడ్చావని యాంకర్ ప్రశ్నించగా.. చాలామంది అమ్మాయిలకు ఈ ఫీలింగ్ ఉంటుందని నా ఫీలింగ్. బాగా ఎక్కువగా ఏడ్చింది అంటే చాలా ఏళ్ల తర్వాత ఫేస్ చేశా. అది కూడా ఒక వ్యక్తి వల్ల. అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి.. అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అమ్మాయిలు వదిలేసి వెళ్లిపోతారని చాలా మీమ్స్ వస్తాయి.. ఎన్నో మాటలు అంటారు. అబ్బాయిలు ఎక్కువగా ఉండటం, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్లే ఉండటం వల్ల వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు రావడం లేదని అనన్య పేర్కొన్నారు.

అబ్బాయిలు, ప్రేమకు సంబంధించిన విషయాల వల్లే అమ్మాయిలు ఎక్కువగా బాధపడతారు. కొన్ని పరిస్ధితుల నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది. ఇది లవ్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అని నేను చెప్పను.. కానీ ఒక వ్యక్తిని బాగా నమ్మాను. చాలామందికి ఇలాంటి పరిస్ధితులు వస్తాయి. రాత్రంతా ఏడుస్తూ కూర్చొంటారు.. ఈ బాధ నుంచి కోలుకోవడానికి రెండు మూడు నెలలు పడుతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే ఆ ఆలోచనలే వెంటాడతాయి. ఎంత బిజీగానే ఉన్నా గుర్తొస్తూనే ఉంటాయి. కొంతకాలం తర్వాత అంతా సర్దుకుంటుందని అనన్య వెల్లడించారు. బ్రేకప్ తాలూకా బాధను మూడేళ్లపాటు అనుభవించా. షూటింగ్స్‌కి మాత్రం అస్సలు మిస్ అయ్యే దానిని కాదు. రాత్రంతా ఏడ్చినా తెల్లవారగానే జిమ్‌కి వెళ్లిపోయా. షూటింగ్‌లో కేరవాన్‌లోనే కూర్చొని నా షాట్ వచ్చే వరకు వెక్కి వెక్కి ఏడ్చేదానిని. తర్వాత కళ్లు తుడుచుకుని నా పని చూసుకునేదానిని అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X