తెలుగమ్మాయి అనన్య నాగళ్ల హాట్ షో.. పద్ధతిగా కనిపిస్తూనే, హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!
తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల మల్లేశం సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ మధ్య ఆమె హాట్ షో చేస్తూ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు తనదైన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విడుదల చేసిన ఒక వీడియో కూడా అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

మల్లేశంతో ఎంట్రీ
తెలంగాణకు చెందిన ఒక నేతన్న జీవిత చరిత్రగా తెరకెక్కిన మల్లేశం సినిమాలో సదరు వ్యక్తి భార్య పాత్రలో ప్రియదర్శి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది అనన్య. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా సరే ఫీల్ గుడ్ సినిమా అని పేరు తెచ్చుకోవడంతో పాటు అనన్య నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు కూడా లభించాయి.

స్పెషల్ ప్లేబ్యాక్
అలా తెలుగులో ఆమె ప్లేబ్యాక్ అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు మార్చి 26వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా వచ్చి వెళ్ళి పోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆహా వేదికగా రిలీజ్ చేయడంతో ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు నచ్చింది కూడా.

వకీల్ సాబ్ తో
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ లో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. అంజలి, నివేద థామస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ సినిమా మొత్తానికి కీలక పాత్రలో నటించింది. ఒక రకంగా ఈ సినిమా తర్వాత ఆమె దశ తిరిగినట్లే చెప్పాలి ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. దీంతో ఆమె సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటూ వెళుతోంది.

వాళ్ళ దృష్టిలో పడేందుకు
అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటూ తనదైన హాట్ ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంది. యోగా చేస్తున్న ఫోటోలు అలాగే జిమ్ తర్వాత టైట్ ఫిట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను విడుదల చేసి నిర్మాతలు అందరి దృష్టిని తన మీద నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది.
Recommended Video

కుర్రకారుకు నిద్రలేకుండా
ఇక ఈ రోజు కూడా అలాంటి ప్రయత్నం చేస్తూ ఒక ఫోటో షూట్ చేసిన ఈ భామ పద్ధతిగా కనిపిస్తూనే హార్ట్ ట్రీట్ ఇచ్చేసింది. క్లీవేజ్ చూపిస్తూ, నాభి అందాలను చూపిస్తూ తన ఫాలోవర్స్ ను టీజ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది ఈ భామ. మత్తెక్కించే కళ్ళతో అనేక ఫోజులు ఇచ్చి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











