నిన్ను పబ్లిక్‌లో కొట్టింది నేనే.. నెటిజన్‌కు అనన్య నాగళ్ల ఊహించని సమాధానం!

తెలుగు పిల్ల అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మల్లేశం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను అంత ఈజీగా మర్చిపోలేరు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ గా ఒక ఊపు ఊపిన వకీల్ సాబ్ సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. వీటితోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అలరించే ఈ చిన్నది ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

ఊహించని స్థాయిలో:అందం, అభినయంతో ఆకట్టుకునే తెలుగు ముద్దుగుమ్మల్లో క్యూట్ స్మైల్ తో అట్రాక్ట్ చేసే అనన్య నాగళ్ల ఒకరు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందు నటనపై ఆసక్తితో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందింది. ఈ క్రమంలోనే ఈ గ్లామర్ బ్యూటి అనన్య నాగళ్ల 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో అనన్య చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది.

Ananya Nagalla Shocking Answer To Netizen In Question Answer Session

ఇల్లాలి పాత్రలో:'షాదీ' షార్ట్ ఫిల్మ్‌లో అనన్య నాగళ్ల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డు కూడా సాధించింది. దీంతో ఈ బ్యూటి సూపర్ పాపులర్ అయిపోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఆమె చెంతకు చేరాయి. అందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఇందులో పద్థతి గల ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది.

గోల్డెన్ ఛాన్స్:బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు పలికించడంలో దిట్ట. అందుకే కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన 'మల్లేశం' సినిమాలో తన నటనకు దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో సినీ ప్రముఖుల దృష్టిని తనవైపు లాక్కున్న క్యూట్ బ్యూటి అనన్య నాగళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.

Ananya Nagalla Shocking Answer To Netizen In Question Answer Session

నెటిజన్ల ప్రశ్నలు:ఇదిలా ఉంటే ఇటీవల సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు అందం అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 'ఆస్క్ మీ' అనే సెషన్ ను ఇన్ స్టా వేదికగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఫొటోలు పెడుతూ మరి సమాధాన ఇచ్చింది.

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు:అనన్య నాగళ్ల నిర్వహించిన 'ఆస్క్ మీ' సెషన్ లో తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి అడగ్గా.. హిట్ ప్లాప్ అన్నది పక్కన పెడితే చాలా ఇంట్రెస్టింగ్, మంచి మంచి పాత్రలు చేస్తున్నానని, అవి సంతృప్తి ఇస్తున్నాయని ఈ బ్యూటి సమాధానం ఇచ్చింది. మీరు రిప్లై ఇవ్వకపోతే అన్నం తినడం మానేస్తా అని మరో నెటిజన్ అడిగితే 'ఫుడ్ మీద కోపం చూపించొద్దు. మీరు కావాలనే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా' అంటూ నవ్వుతూ సరదాగా ఆన్సర్ చెప్పింది.

Ananya Nagalla Shocking Answer To Netizen In Question Answer Session

చాలా భయపడ్డాను:వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ తర్వాత మిమ్మల్నే ఎక్కువగా చూశానని ఒకరు అంటే 'ఇది ఏమైనా నమ్మేలా ఉందా అసలు' అని రిప్లై ఇచ్చింది అనన్య నాగళ్ల. 'లాస్ట్ టైమ్ మిమ్మల్ని స్టేడియంలో బాటిల్ తో కొట్టింది నేనే' అని మరో నెటిజన్ అన్నాడు. దీనికి ''మీరేనా కొట్టింది. అలా కొట్టడం తప్పు. ఏ యాక్టర్ తో అలా ప్రవర్తించకండి. మేము మనుషులమే కదా. ఆ రోజు నేను చాలా భయపడ్డా'' అంటూ ఎలాంటి కోపం చూపించకుండా ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది ఈ తెలుగు పిల్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X